Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా?.. ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే.. లేదంటే ఇబ్బందే..

|

Sep 25, 2021 | 7:59 AM

Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వచ్చే భక్తులకు పలు నిబంధనలు విధించింది.

Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా?.. ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే.. లేదంటే ఇబ్బందే..
Ttd
Follow us on

Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వచ్చే భక్తులకు పలు నిబంధనలు విధించింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిపికెట్ తప్పనిసరిగా చూపాలని ఆలయ ఈవో జవహార్ రెడ్డి స్పష్టం చేశారు. లేదంటే.. మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ అయినా తీసుకురావాలన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా ఈవో జవహార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అయితే, 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఈ నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. ఇక 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారికి దర్శనం తేదీ నుంచి 72 గంటల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు. 18 సంవత్సరాల పైబడిన వారికి రెండు డోసుల వ్యాక్సీన్ వేసుకున్న సర్టిఫికెట్, లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఈవో స్పష్టం చేశారు. అయితే, ఈ నిబంధనలుపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు సడలింపు ఉంటుందని, అక్టోబర్ 1వ తేదీ నుంచి పక్కా అమలు చేయడం జరుగుతుందని ఈవో చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

కాగా, శ్రీవారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను ఆహ్వానిస్తామని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.

ఇదిలాఉంటే.. శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తుల నుంచి ఊహించని పోటీ వస్తోంది. తాజాగా ఒక దర్శన స్లాట్ కోసం దాదాపు 5.5 లక్షల మంది పోటీ పడినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలకు సంబంధి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం నాడు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను విడుదల చేసిన వెంటనే.. 1.06 లక్షల మంది సైట్‌లో లాగిన్ అయ్యారు. క్షణాల వ్యవధిలోనే ఆ సంఖ్య 5.5 లక్షలకు చేరుకుంది. ఇంత పోటీని చూసి టీటీడీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Also read:

‘Bharat Bandh’: రైతు, కార్మిక, ప్రజా విధానాలను నిరసిస్తూ రైతు సంఘాల ఆందోళన.. ఈనెల 27న భారత్ బంద్‌కు విపక్షాల మద్దతు

National Cooperative Conference : ఢిల్లీ వేదికగా నేడు సహకార సంస్థల మెగా సదస్సు.. తొలిసారి ప్రసంగించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..

Gold-Silver Price Today: మహిళలు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం ధరలు.. అదే బాటలో పయనిస్తున్న వెండి