Vaikunta Dwara Darshanam: టీటీడీ అలర్ట్‌.. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ముఖ్య నిబంధనలు..

|

Dec 29, 2022 | 6:54 AM

జనవరి రెండు నుంచి వైకుంఠ ఏకాదశి పర్వది నాలు మొదలై అదే నెల 11 అర్ధరాత్రి వరకు గడియలుంటాయి. ఈ మేరకు ఆయా రోజుల్లో శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన..

Vaikunta Dwara Darshanam: టీటీడీ అలర్ట్‌.. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ముఖ్య నిబంధనలు..
Tirumala Srivari Temple
Follow us on

దేశంలో మరోమారు కోవిడ్‌ అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు సన్నద్ధమవుతున్నారు. 2023 కొత్త సంవత్సరంతో పాటు రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తిరుమలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ముఖ్యమైన సూచనలు చేసింది. జనవరి రెండు నుంచి వైకుంఠ ఏకాదశి పర్వది నాలు మొదలై అదే నెల 11 అర్ధరాత్రి వరకు గడియలుంటాయి. ఈ మేరకు ఆయా రోజుల్లో శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టైంస్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు. భక్తులు తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లు పొంది వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా త్వరితగతిన శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల కోసం వీఐపీల సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేశారు. స్వయంగా వచ్చే విఐపిలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు.

దేశంలో మరోమారు కరోనా వైరస్‌ వ్యాప్తిపై కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూ టీటీడీ కీలక నిర్ణయాలు ప్రకటించింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్ తో పాటు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రధాన కల్యాణ కళ్యాణ కట్ట ఎదురుగా గల పిఎసి-4లో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తామని తెలియజేశారు. టిక్కెట్లు లేదా టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి