TTD News: కరోనా (Corona) ప్రభావం కలియుగ దైవం తిరుమల శ్రీవారిపై కూడా పడిన విషయం తెలిసిందే. కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ (TTD) అధికారులు ఆంక్షలు విధించారు. మొదట్లో భక్తులకు పూర్తిగా దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ వచ్చారు. అనంతరం కేవలం పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తూ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తూ వచ్చారు.
అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుడండంతో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత కొవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి శ్రీవారిని సాఫీ దర్శించుకునే చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఆదివారం చెన్నైలోని టీటీడీ స్థానిక సలహా మండలి సభ్యుల పదవీ ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘త్వరలోనే ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తాం. నెల రోజుల్లో సాధారణమైన దర్శన ప్రక్రియ మొదలవుతుంది. సర్వదర్శనం అందుబాటులోకి తీసుకొస్తాం. తమిళనాడు, పుదుచ్చేరి నుంచి కాలినడకన వస్తున్న భక్తుల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటున్నాం. చెన్నైలో ఆలయ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమవుతాం. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో రెండుచోట్ల భూములిచ్చింది’ అని చెప్పుకొచ్చారు.
Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం.. ఘనంగా ఆరవరోజు కార్యక్రమాలు.. (లైవ్ వీడియో)