Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) ని దర్శించుకోవాలనుకునే భక్తులకు త్వరలో టీటీడీ(TTD) బోర్డు షాక్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పందించారు. ఆర్జిత సేవల ధరల పెంపుపై టీటీడీ చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. తిరుమలలో ఏ సేవలకు ధరలు పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆర్జిత సేవలను ఏప్రిల్ 1 నుండి పునరుద్ధరిస్తామని చెప్పారు. వారాంతాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో సామాన్య భక్తులు సంతృప్తికరంగా దర్శించుకుంటున్నారని చెప్పారు సుబ్బారెడ్డి. దీంతో సామాన్య భక్తుల దర్శనాలను దృష్టిలో పెట్టుకుని సిఫార్సులు తగ్గించేందుకు బోర్డు లో చర్చించాం .. ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని ఆయన స్పష్ట చేశారు
అంతేకాదు రెండేళ్ల తర్వాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని.. దీంతో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అన్నప్రసాదం విషయంలో ఎటువంటి లోటు రానివ్వమని ఎంతమంది భక్తులు వచ్చినా స్వామివారి అన్నప్రసాదాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు తిరుమలలో హోటళ్ల తొలగింపుపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీకి భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదం అందించాలనే ఆలోచన మాత్రమే ఉందని.. అయితే ఆ ఆలోచనను ఇప్పటికిప్పుడు అమలు చేయడంలేదని చెప్పారు., ప్రస్తుతం తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ లు, హోటళ్లు యథావిధిగా నడుస్తాయని చెప్పారు. తిరుమలలో ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా హోటళ్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సుబ్బారెడ్డి చెప్పారు.
Also Read: