TTD: మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే..

|

Nov 06, 2021 | 4:52 PM

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది...

TTD: మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే..
Ttd
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరుప‌తి న‌గ‌రంలో నవంబర్ 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పింది. ఈ కారణంగా నవంబ‌ర్ 12, 13 14వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

తిరుమల స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ట్, తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ దర్శకుడు గోపీచంద్ దర్శించుకున్నారు.

Read Also… Kartika Masam: ప్రీతికరం కార్తీక మాసం విశిష్టత.. ఆచరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోండి..

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ దర్శన భాగ్యం భక్తులకు ఎప్పటి నుంచంటే..?

Kedarnath Temple: దీపావళి వేళ దేదీప్యమానంగా వెలుగులీనుతున్న కేధార్‌నాథ్ క్షేత్రం.. చూస్తే వావ్ అనాల్సిందే..

Yadadri Temple: డ్రోన్‌ కెమెరాల్లో యాదాద్రి ఆలయం.. కట్టిపడేస్తున్న సుందర దృశ్యాలు..