TTD: తిరుమలలో ఈ నెల 11 విశేష పర్వదినాలు.. ప్రకటించిన టీటీడీ

| Edited By: Narender Vaitla

Jan 01, 2024 | 8:57 AM

ఇక జ‌న‌వ‌రి 7న స‌ర్వ ఏకాద‌శి కాగా, జ‌న‌వ‌రి 9న తొండ‌ర‌డిప్పొడి యాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం నిర్వహించనున్నారు. జ‌న‌వ‌రి 14న భోగిపండుగ‌, ధ‌నుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై సేవను నిర్వహించనున్నారు. జ‌న‌వ‌రి 15వ తేదీన మ‌క‌ర సంక్రాంతి నుంచి సుప్ర‌భాత సేవ పునఃప్రారంభించనున్నారు. జ‌న‌వ‌రి 16న తిరుమ‌ల శ్రీ‌వారు పార్వేట మండ‌పానికి వేంచేపు చేయగా క‌నుమ పండుగ‌ను టీటీడీ...

TTD: తిరుమలలో ఈ నెల 11 విశేష పర్వదినాలు.. ప్రకటించిన టీటీడీ
TTD
Follow us on

కొత్త ఏడాది మొదటి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా తెలిపింది. జనవరి నెలలో మొత్తం 11 విశేష ప‌ర్వ‌దినాలున్నట్లు టీటీడీ తెలిపింది. జ‌న‌వ‌రి 1న శ్రీ‌వారి ఆల‌యంలో పెద్దశాత్తుమొర‌, వైకుంఠద్వార ద‌ర్శ‌నం ముగియనుంది. అనంతరం జ‌న‌వ‌రి 5న శ్రీ‌వారి ఆల‌యంలో అధ్య‌య‌నోత్స‌వాలు ముగియనుండగా, జ‌న‌వ‌రి 6న తిరుమ‌ల శ్రీ‌వారు తిరుమ‌ల‌నంబి స‌న్నిధికి వేంచేపు చేస్తారు.

ఇక జ‌న‌వ‌రి 7న స‌ర్వ ఏకాద‌శి కాగా, జ‌న‌వ‌రి 9న తొండ‌ర‌డిప్పొడి యాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం నిర్వహించనున్నారు. జ‌న‌వ‌రి 14న భోగిపండుగ‌, ధ‌నుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై సేవను నిర్వహించనున్నారు. జ‌న‌వ‌రి 15వ తేదీన మ‌క‌ర సంక్రాంతి నుంచి సుప్ర‌భాత సేవ పునఃప్రారంభించనున్నారు. జ‌న‌వ‌రి 16న తిరుమ‌ల శ్రీ‌వారు పార్వేట మండ‌పానికి వేంచేపు చేయగా క‌నుమ పండుగ‌ను టీటీడీ నిర్వహించనుంది. జ‌న‌వ‌రి 25న శ్రీ‌రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. జ‌న‌వ‌రి 28న తిరుమొళి శైయాళ్వార్ వ‌ర్ష‌ తిరున‌క్ష‌త్రం, జ‌న‌వ‌రి 31న కూర‌త్తాళ్వార్ వ‌ర్ష‌తిరున‌క్ష‌త్రం నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే రేపటి నుంచి (మంగళవారం) భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభించిన ఉత్తర ద్వారాదర్శనం నేటితో ముగియనున్నది. డిసెంబర్‌ 23 నుంచి 10 రోజులపాటు ప్రారంభంకాగా నిత్యం 60 వేల నుంచి 80 వేల మంది భక్తుల దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సర్వదర్శనాన్ని రద్దు చేసి, దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రత్యేక ఉచిత టోకెన్లు ఉచితంగా పంపిణీ చేసి ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..