TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి ఆర్జిత సేవలకు గ్రీన్‌సిగ్నల్..

|

Feb 06, 2021 | 9:19 AM

 కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలకు మార్చి నుంచి భక్తులను అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి ఆర్జిత సేవలకు గ్రీన్‌సిగ్నల్..
Follow us on

TTD News:  కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలకు మార్చి నుంచి భక్తులను అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చెన్నైలోని టీనగర్‌లో భక్తులు టీటీడీకి ఇచ్చిన స్థలంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఈనెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు వివరించారు. విశాఖపట్నం, అమరావతిలలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాలను ఏప్రిల్‌ తరువాత ప్రారంభిస్తామని వెల్లడించారు.హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

మరోవైపు రథసప్తమికి సంబంధించి కేవలం టికెట్లు ఉన్న భక్తులనే… తిరుమల కొండమీదకు అనుమతించనున్నట్లు టీడీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఒకరోజు ముందు టికెట్లు తీసుకోవచ్చని శుక్రవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో వివరించారు.

Also Read:

ఆమె జీవితం కష్టాల కల్లోలం.. పొట్టకూటి కోసం కాటికాపరిగా మారిన వైనం… ముత్యాల అరుణ కన్నీటి గాథ

దేహమే మందిరం.. ఒళ్లంతా పచ్చ బొట్లు.. ఆ తెగ పలుకులోనూ, పనిలోనూ నిత్యం మర్యాదా పురుషోత్తముడే