TSRTC: రామభక్తులకు శుభవార్త.. భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

|

Apr 09, 2022 | 9:16 PM

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామ భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భద్రాచలం(Bhadrachalam) సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు(Special Busses) నడుపుతున్నట్లు...

TSRTC: రామభక్తులకు శుభవార్త.. భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Tsrtc
Follow us on

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామ భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భద్రాచలం(Bhadrachalam) సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు(Special Busses) నడుపుతున్నట్లు వెల్లడించింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్(Corona Virus) కారణంగా భక్తులు లేకుండానే కల్యాణం నిర్వహించారు. అయితే, ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో స్వామివారి కల్యాణాన్ని లక్షలాది భక్తుల నడుమ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలి రానున్నారు. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి 70 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇవి ఎంజీబీఎస్‌తో పాటు ఎల్‌బీనగర్ ముఖ్య కూడళ్ల నుంచి అందుబాటుల్లో ఉంటాయని వెల్లడించింది. భద్రాచలం వెళ్లే ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు పెంచుతామని ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీస్ఆర్టీసీ అధికారులు కోరారు.

మరోవైపు.. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ్టి రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ఘనంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణానికి కొద్ది ఘడియల ముందు అత్యంత ఘనంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. సీతారాముల గుణాలను వివరించే తీరు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. సీతమ్మ వైపు ఒకరు.. రామయ్య వైపు ఇంకొక్కరు ఉండి ఇరు వంశాల గొప్పలను సుభాషించే తీరు ఆద్యంతం సంతోషాలను పంచుతుంది. ఈ ఉత్సవం తర్వాత స్వామివారి తిరువీధి సేవ ఉంటుంది.

Also Read

Lakshmi Manchu: కొత్త గెటప్‌లో షాకిస్తున్న మంచు లక్ష్మి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

AP Crime: ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని.. ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

CSK vs SRH IPL Match Result: చెన్నైని చితక్కొట్టిన అభిషేక్, త్రిపాఠి.. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం..