Rajendra Prasad – Manchu Vishnu – Tirumala : దేవదేవుడు తిరుమల శ్రీవారిని ఆదివారం సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో రాజేంద్రప్రసాద్, మంచు విష్ణు వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం బయట సినీనటుడు రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకోలేక పోయానని, ఆలస్యంగా అయినా స్వామి వారి ఆశీస్సులు పొందినట్లు తెలిపారు.
అనుకోకుండా స్వామివారి సుందరకాండ పారాయణం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పటి వరకూ నాలుగు సార్లు సుందరకాండ పారాయణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. తిరుమలలో సుందరకాండ పారాయణం నిర్వహించిన 60 రోజులకి అయోధ్యలో రామ మందిరం ప్రారంభించడం జరిగిందన్నారు. సుందరకాండ పారాయణం కొనసాగుతుండగానే ఆంజనేయస్వామి జన్మస్ధలం అంజనాద్రే అని టిటిడి కమిటి నిర్ధారించడం ఎంతో సంతోషాన్ని కలుగజేసిందన్నారు రాజేంద్రప్రసాద్.
బాలకాండ పారాయణం ఈరోజు నుంచి టిటిడి నాద నీరాజనం మండపంలో ప్రారంభించిందని, కరోనా మహమ్మారి అంతం కావాలని, త్వరలో థియేటర్లు ప్రారంభం అయి.. అందరూ సినిమాలు వీక్షించే అవకాశం కలిగించాలని స్వామి వారి ప్రార్ధించినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Read also : Revanth Reddy : ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగిస్తాం : రేవంత్ రెడ్డి