Tirumala News: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు, ఎల్లుండి తిరుమల నడకదారికి బ్రేక్..

|

Nov 16, 2021 | 7:20 PM

Tirumala Tirupati News: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అల్పపీడన

Tirumala News: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు, ఎల్లుండి తిరుమల నడకదారికి బ్రేక్..
Tirumala News
Follow us on

Tirumala Tirupati News: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అల్పపీడన ప్రభావంతో తిరుమలను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండపై నిత్యం వర్షం కురుస్తూనే ఉంది. అసలే చలి. ఆపై వర్షంతో భక్తులు గజగజ వణికిపోతున్నారు. తిరుపతి నుంచి తిరుమల రావడానికి, కిందకు వెళ్లడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మెట్ల మార్గంలో సైతం వరద నీరు పోటెత్తుతోంది. అయితే, తాజాగా ఏర్పిడిన మరో అల్పపీడనంతో వాతావరణశాఖ ఏపీని అప్రమత్తం చేసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. రేపు, ఎల్లుండి నడకదారి మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్లు మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాల ఉంటాయన్న హెచ్చరికలతో నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదని టీటీడీ వెల్లడించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుమల నడకమార్గాలను మూసివేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది.

తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షాలకి ఇటీవల నడకదారిలో భారీగా నీరు ప్రవహించింది. మెట్లపై నడవలేని విధంగా వరద ప్రవాహం కనిపించింది. దీంతో నడకమార్గంలో భక్తులు పిట్టగోడలపై నడుస్తూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ అప్రమత్తమై అలిపిరి, శ్రీవారి మెట్లు మార్గాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది.

Also Read:

Viral Video: ఇదెక్కడి సీన్ గురూ..! రిమోట్‌తో కంట్రోల్ చేస్తూ డ్రోన్‌ను ఎగరేస్తున్న చింపాంజీలు! వీడియో వైరల్

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ జనాలకు వాతావరణ శాఖ వార్నింగ్.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు..