తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో హుండీలో నుంచి కానుకలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కానుకలను హుండీలో వేసి.. తిరిగి హుండీని జాగ్రత్తగా లారీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పరకామణికి తరలించారు.
శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఆపద మొక్కుల వాడ మమ్ము కాచి కాపాడు అంటూ శ్రీవారికి కానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. అవి డబ్బు రూపంలో గానీ, బంగారం రూపంలో గానీ భక్తులు కానులు సమర్పిస్తారు. శ్రీవారికి హుండీ ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. కానుకలు సమర్పించడాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి హుండీ కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన చెందారు. అయితే ఈ ఘటనపై స్పందించిన టీటీడీ అధికారులు .. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడి పోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..