Ratha Saptami 2021: కరోనా నిబంధనలను పాటిస్తూ రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న టీటీడీ

|

Jan 19, 2021 | 11:07 AM

కరోనా నిబంధనలను పాటిస్తూ.. తిరుమల తిరుపతిలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 వ తేదీన ఈ వేడుకలను నిర్వహించనున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు...

Ratha Saptami 2021: కరోనా నిబంధనలను పాటిస్తూ రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న టీటీడీ
Follow us on

Ratha Saptami 2021: కరోనా నిబంధనలను పాటిస్తూ.. తిరుమల తిరుపతిలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 వ తేదీన ఈ వేడుకలను నిర్వహించనున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఆరోజున శ్రీవారు సప్తవాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మాడ వీధుల్లో వాహన సేవలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే గ్యాలరీలోకి అనుమతినివ్వనున్నామని టీటీడీ అధికారులు చెప్పారు.

చక్రస్నాన కార్యక్రమాన్ని ఏకాంతగానే నిర్వహించనున్నామని తెలిపారు. రథ సప్తమి వేడుకల్లో భాగంగా ఆ రోజు ఉదయం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీవారు ఊరేగనుండగా.. ఉదయం 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ ఉంటుంది. ఇక, మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ , సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం ఉరేగింపు.. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని తెలిపారు.

Also Read:  ఏళ్లుగా పాప్ రారాజు స్టెప్స్ వేస్తూ ట్రాఫిక్‌ని నియంత్రిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్