Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. కీలక ప్రకటన విడుదల చేసిన టీటీడీ బోర్డు..

Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది.

Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. కీలక ప్రకటన విడుదల చేసిన టీటీడీ బోర్డు..
Srivari Temple

Updated on: Mar 07, 2022 | 10:27 PM

Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకారం.. సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లు నిర్వహిస్తారు. కోవిడ్‌-19 ప‌రిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుంది. అదేవిధంగా, క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొన‌సాగుతుంది. వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు. వారికి ద‌ర్శనం క‌ల్పించ‌డంతోపాటు ప్రసాదాలు అందించ‌డం జ‌రుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్తమాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమ‌తిస్తారు.

Also read:

UKRAINE-RUSSIA WAR: రష్యా, యుక్రెయిన్ వివాదంలోకి ప్రధాని మోదీ.. టెలిఫోనిక్ సంభాషణలతో శాంతి సమాలోచనలకు ఛాన్స్?

Google Images: మీకు గూగుల్‌లో కావాల్సిన ఫోటోలు దొరకడం లేదా..? ఇలా చేయండి..!

Exit Poll Results: యూపీలో యోగికే మళ్లీ బ్రహ్మరథం.. పంజాబ్‌లో ఆప్‌ హవా.. ఉత్తరాఖండ్‌, గోవాలో టఫ్‌ ఫైట్‌..