Tirumala Devasthan Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలను ప్రకటించిన టీటీడీ

|

Oct 21, 2021 | 6:53 AM

శ్రీవారి దర్శన భాగ్యం మరింత మందికి లభించనుంది. వచ్చే నెల నుంచి దర్శనం చేసుకునే రోజువారీ టికెట్ల సంఖ్యను పెంచనుంది టీటీడీ. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు..

Tirumala Devasthan Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలను ప్రకటించిన టీటీడీ
Tirumala Temple
Follow us on

శ్రీవారి దర్శన భాగ్యం మరింత మందికి లభించనుంది. వచ్చే నెల నుంచి దర్శనం చేసుకునే రోజువారీ టికెట్ల సంఖ్యను పెంచనుంది టీటీడీ. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం తిరుమలకు వేలాది మంది తరలివస్తారు. అయితే రోజువారీ టికెట్ల సంఖ్యను ఇటీవల తగ్గించడంతో చాలా మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం లభించడం లేదు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నవంబర్‌ నెలలో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సంఖ్యను పెంచనున్నారు టీటీడీ అధికారులు.

నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం టికెట్లు రోజుకు 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 12వేలు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నవంబరు నెలకు ప్రత్యేక, సర్వదర్శన టికెట్ల విడుదల తేదీలను కూడా టీటీడీ ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు, 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నారు.

గత నెలలో సర్వదర్శనం టికెట్లను రోజుకు 8 వేల మందికి మాత్రమే అనుమతించింది టీటీడీ. సెప్టెంబర్‌ 25న టోకెన్లు విడుదల చేయగా, కేవలం 35 నిమిషాల్లోనే 35 రోజుల టోకెన్లు బుక్‌ అయ్యాయి. ఈనెల 22,23వ తేదీల్లో విడుదల చేసే శ్రీవారి దర్శన టికెట్లు కూడా అంతే స్థాయిలో హాట్‌ కేకుల్లా బుక్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక దీపావళి ముందు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కోవిడ్ తర్వాత భక్తుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. దీంతో టీటీడీ అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పౌర్ణ‌మి సంద‌ర్భంగా గ‌రుడ‌వాహ‌నంపై శ్రీవారు విహ‌రించడంతో కనులారా ఆ స్వామి వైభవాన్ని తిలకించారు భక్తులు.

ఇవి కూడా చదవండి: Aryan Khan: షారుఖ్‌కు మరో షాక్ .. ఆర్యన్ ఖాన్‌‌కు దొరకని బెయిల్.. నిరాశలో అభిమానులు..

Jammu and Kashmir: కశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్మీ అధికారి..