Tirumala: సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ వైరల్.. నిషేధం ఉన్నా ఎలా డ్రోన్ కెమెరా ఎగిరిందంటూ భక్తులు ఆగ్రహం

|

Jan 21, 2023 | 1:36 PM

వేంకటాచల నాథుడి ఆలయానికి సంబంధించిన డ్రోన్ షాట్స్ సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుండి అప్ లోడ్ అయింది. వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

Tirumala: సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ వైరల్.. నిషేధం ఉన్నా ఎలా డ్రోన్ కెమెరా ఎగిరిందంటూ భక్తులు ఆగ్రహం
Tirumala Temple
Follow us on

కలియుగ ప్రత్యేక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే  తాజాగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. వేంకటాచల నాథుడి ఆలయానికి సంబంధించిన డ్రోన్ షాట్స్ సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుండి అప్ లోడ్ అయింది. వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. టీటీడీ దృష్టికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియోను అప్లోడ్ చేసిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తాముని చెప్పారు. ఇప్పటికే నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదే విషయంపై టీటీడీ సి వి ఎస్ ఓ నరసింహ కిషోర్ స్పందిస్తూ.. శ్రీవారి ఆలయానికి సంబందించిన ఈ వీడియోను డ్రోన్ కెమెరాతో తీశారా లేక గూగుల్ నుండి సేకరించారా అన్నది ఫోరెన్సిక్ కు పంపి నిర్ధారణ చేసుకుంటామని చెప్పారు.

అయితే నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో డ్రోన్‌ కెమెరాలు ఎలా వాడుతారని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగరవేసినా గుర్తించలేని విజిలెన్స్ యంత్రాంగం.. అంటూ మండి పడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..