Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ శుభ వార్త చెప్పింది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును అందుబాటులోకి తేనుంది. ఘాట్ రోడ్ మరమ్మతు పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 11 రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జనవరి 9న ఘాట్‌రోడ్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన ఆయన ఈ విషయం వెల్లడించారు. జనవరి 11 రాత్రికల్లా ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో ఘాట్ రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే..పెద్ద బండరాళ్లు పడడంతో.. రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద రహదారి భారీగా కోతకు గురైంది. దీంతో రెండో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిలివేశారు. ధ్వంసమైన ఘాట్ రోడ్డు మరమ్మతులు శరవేగంగా పూర్తి చేశారు. రేపటి నుంచి రెండో ఘాట్ రోడ్డు మీద నుంచి వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.
మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలను శోభాయమానంగా అలంకరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. స్వామివారిని భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: