AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వ్యాపారంలో నష్టాలా.? అయితే ఇంట్లోని అక్వేరియం విషయంలో మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..

మన జీవితాలపై వాస్తు ప్రభావం ఉంటుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఇంట్లో వస్తువులు సరైన దిశలో లేకపోతే అది ఆరోగ్యం, ఆర్థికంగా ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇలా వాస్తు వ్యాపార రంగంలో ఉన్నతిపై...

Vastu Tips: వ్యాపారంలో నష్టాలా.? అయితే ఇంట్లోని అక్వేరియం విషయంలో మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Nov 08, 2022 | 4:21 PM

Share

మన జీవితాలపై వాస్తు ప్రభావం ఉంటుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఇంట్లో వస్తువులు సరైన దిశలో లేకపోతే అది ఆరోగ్యం, ఆర్థికంగా ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇలా వాస్తు వ్యాపార రంగంలో ఉన్నతిపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో పెట్టుకునే అక్వేరియం విషయంలో చేసే కొన్ని తప్పులు వ్యాపారంలో నష్టాలకు కారణంగా మారుతుందని సూచిస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తల వల్ల ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ అక్వేరియం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? అసలు అక్వేరియం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి.? వంటి వివరాలు మీకోసం..

వ్యాపారంలో పనులు ఆగిపోతుంటే, లాభాలు తగ్గుతుంటే ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవాలని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అక్వేరియంలో రెండు చేపలను ఉంచడం వల్ల ప్రయోజనం జరుగుతుందని చెబుతున్నారు. జంత చేపలను అక్వేరియంలో పెంచడం ద్వారా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి దూరమవుతుందంటా. తరచుగా వ్యాపారాల్లో వచ్చే నష్టాన్ని అక్వేరియంతో చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు.

ఇక అక్వేరియాన్ని ఏర్పాటు చేసే దిశ కూడా మనకు కలిగే ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అక్వేరియంను ఈశాన్య లేదా తూర్పు దిశలోనే ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాకాకుండా వేరే దిక్కుల్లో పెడితే లాభం కంటే నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొందరు అందరి దృష్టిని ఆకర్షించాలని ఎక్కడపడితే అక్కడే అక్వేరియాన్ని ఏర్పాటు చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలపిన విషయాలు వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సూచనల మేరకు మాత్రమే అందించడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించగలరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!