AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభకార్యానికి వెళ్లే ముందు పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారో తెల్సా.. దీని వెనుక సైన్స్ ఇదే

పెరుగు-చక్కెర కలిపి తినిపించడం కేవలం సాంప్రదాయ పద్ధతి కాదు. ఆరోగ్యకరమైన అలవాటు. దీని వెనుక సైన్స్ ఉంది. ఇది మూడు ముఖ్యమైన అంశాలకు సంబంధించినది. ఒత్తిడి, జీర్ణక్రియ, శక్తి. కనుక తదుపరి మీరు పెరుగు, చక్కెరని కలిపి తిని రోజును ప్రారంభించినప్పుడు.. అది శుభప్రదానికి మాత్రమే కాదు.. శరీరానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని తెలుసుకోండి.

శుభకార్యానికి వెళ్లే ముందు పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారో తెల్సా.. దీని వెనుక సైన్స్ ఇదే
Auspicious Occasion
Surya Kala
|

Updated on: May 24, 2025 | 1:33 PM

Share

భారతీయ సంస్కృతిలో ఏదైనా శుభ కార్యం, పరీక్ష, కొత్త ఉద్యోగం లేదా ఎక్కడికైనా వెళ్ళే ముందు పెరుగు , చక్కెర కలిపి తినడం ఒక సంప్రదాయం. చాలా మంది ఇది కేవలం మతపరమైన లేదా సాంప్రదాయ చిహ్నం అని అనుకుంటారు. అయితే దీని వెనుక విశ్వాసం మాత్రమే కాదు.. సైన్స్ కూడా ఉంది. పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. అది కూడా శరీరానికి, మానసిక స్థిరత్వానికి అందించే శక్తికి బలమైన సంబంధం కలిగి ఉన్నాయి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం భారతదేశంలో పెరుగు, చక్కెర తినడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పరీక్ష రాసే ముందు కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయలుదేరే ముందు..ఇంటి పెద్ద పెరుగు చక్కెర కలిపి తినిపిస్తుంది. ఈ చర్యకు చిహ్నం ‘మధురమైన ప్రారంభం’ అనే భావనతో ముడిపడి ఉంది. స్వీట్ తినడం వల్ల అదృష్టం వస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ సంప్రదాయానికి కేవలం మతపరమైన దృక్పథం కంటే.. ఇలా చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.

పనులు చేసే ముందు ఒత్తిడిగా అనిపించడం

ఇవి కూడా చదవండి

మనం సాధారణంగా పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా పెద్ద పనుల మొదలు పెట్టే ముందు ఒత్తిడికి గురవుతాము. అలాంటి సమయాల్లో శరీరానికి త్వరగా శక్తినిచ్చే ఆహారం అవసరం. మెదడుకు తక్షణ శక్తిని అందించే గ్లూకోజ్‌కు చక్కెర ఒక ముఖ్యమైన మూలం. మరోవైపు పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. అందువల్ల పెరుగు, చక్కెర తినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.

పెరుగులో ‘లాక్టోబాసిల్లస్’ అనే బ్యాక్టీరియా ఉందని ఇది పేగు బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని అనేక శాస్త్రీయ అధ్యయనాలు చూపించాయి. ఒత్తిడి సమయంలో జీర్ణవ్యవస్థ చెదిరిపోతుంది. అయితే పెరుగు దానిని సమతుల్యంగా ఉంచుతుంది. కనుక పెరుగుకి చక్కెర జోడించడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇది కీలకమైన సమయాల్లో ఉపయోగపడుతుంది.

శరీరాన్ని తాజాగా వేసవిలో శరీరం వేడిగా ఉంటుంది. కనుక పెరుగు శరీర వేడిని తగ్గిస్తుంది. చక్కెర శక్తిని నిలుపుతుంది. అందువల్ల ప్రయాణించేటప్పుడు లేదా ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు, చక్కెర తినడం వల్ల శరీరం చల్లగా , తాజాగా ఉంటుంది. రోజూ పెరుగు, చక్కెర తినడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. పెరుగు కడుపులోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. చక్కెర ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మనం ఖాళీ కడుపుతో ఏదైనా పని ప్రారంభించినప్పుడు పెరుగు, చక్కెర ఒక గొప్ప ఎంపిక.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు