
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలోని వివిధ అంశాలను ప్రస్తావించాడు. జీవితాన్ని ఎలా విజయవంతం చేసుకోవాలో కూడా బోధించాడు. అదే సమయంలో మిమ్మల్ని వైఫల్యానికి గురిచేసే విషయాల గురించి కూడా చెప్పాడు. అటువంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు పేదరికానికి కారణమని చెప్పిన కొన్ని అలవాట్ల గురించి ముఖ్యంగా ఇంట్లోనైనా ఇటువంటి అలవాటు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని.. ఆ ఇల్లు పేదరికంతో ఉంటుందని చెప్పాడు.
ఇంట్లో మహిళల స్థానం
చాణక్య నీతి ప్రకారం ఎవరి ఇంట్లోనైనా స్త్రీల స్థితి బాగా లేకపోతే, సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి అక్కడ ఎప్పుడూ నివసించదు. ఎవరి ఇంట్లోనైనా స్త్రీలను అవమానించినా, చెడుగా ప్రవర్తిస్తే, సంపదతో పాటు, అలాంటి ఇంటి ప్రజలకు పరువు కూడా ఉండదని చాణక్య చెప్పాడు. కనుక ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మీరు కోరుకుంటే ఇంటిలోని మహిళలతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించకండి.
అహంకారం, ఇతరులను మోసం చేయడం
అహంకారంగా ప్రవర్తించి ఇతరులను మోసం చేసే ధోరణి ఉన్నవారు జీవితాంతం పేదవారిగా జీవిస్తారు. మోసం చేసేవారికి కొంతకాలం డబ్బు లభించవచ్చు .. అయితే ఈ డబ్బు ఎప్పుడూ వృద్ధి చెందదని చాణక్యుడు చెబుతున్నాడు. అందుకే ఎవరైనా సరే పొరపాటున కూడా ఇతరులను మోసం చేయకూడదు. అహంకారానికి దూరంగా ఉండాలి.
దుర్భాషలాడే వ్యక్తి
దుర్భాషలాడే వ్యక్తిపై ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. నోటికి వచ్చినట్లు ముందు వెనుక చూడకుండా.. పరిస్థితిని అంచనా వేయకుండా మాట్లాడటం వల్ల వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విజయం సాధించలేరు. అలాంటి వ్యక్తుల జీవితంలో ఆర్థిక సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి.
వంటగది శుభ్రం లేకుండా
ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ఇంటి వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరి వంటగదిలోనైనా మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ ఉంచితే..అటువంటి వారిపై లక్ష్మీదేవి ఆగ్రహం కలిగి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా కలగవచ్చు. కనుక ఎప్పటికప్పుడు వంట గదిని శుభ్రం చేసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.