వ్యక్తి జీవితం సక్రమంగా ఉండేందుకు ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రం గ్రంధంలో అనేక సూచనలు, సలహాలు పేర్కొన్నారు. ఆయన చేసిన సూచనలు ప్రజల జీవితానికి మార్గనిర్దేశనం. ఒక వ్యక్తి కుటుంబం నుంచి బయటి ప్రపంచ వరకు ఎలా ప్రవర్తించాలో చాణక్యుడు పాయింట్ టు పాయింట్ వివరించారు. కర్మ, సత్యం, మంచి ప్రవర్తనతో జీవితాన్ని గడపాలని చాణక్యుడు సూచించారు. అంతేకాదు.. విద్య, వైవాహిక జీవితం, విజయం, బాధ్యతలకు సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నారు. చాణక్యుడు స్త్రీల గురించి కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. కొన్ని చెడు అలవాట్లు స్త్రీలనే కాదు.. మొత్తం కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తాయన్నారు. మరి ఆ చెడు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక కుటుంబం భవిత్యంలో స్త్రీ కీలక పాత్ర పోషిస్తుందని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నారు. సంతోషకరమైన, సంపన్నమైన జీవితం కోసం మహిళలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. అయితే, కొన్నిసార్లు ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, అలాంటి సందర్భాల్లోనూ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలని సూచించారు. లేదంటే జీవితంలో పశ్చాత్తాపపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి సందర్భంలోనూ ‘అవును’ అని చెప్పకూడదంటారు చాణక్య. ఈ అలవాటు వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
సాధారణంగానే ప్రతి మహిళ తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తూ జీవితాన్ని గడుపుతారు. కానీ, కొంతమంది స్త్రీలు స్వార్థపూరిత ధోరణిని కలిగి ఉంటారు. అది కుటుంబానికి మంచి కాదు. కేవలం ఆడవాళ్లు మాత్రమే కాదు.. ఇతర కుటుంబ సభ్యులంతా ఇలాగే మారే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రవర్తన అన్ని వేళలా మంచిది కాదని, దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించారు చాణక్య.
స్త్రీ అయినా, పురుషుడు అయినా ఎవరూ అబద్ధాల జోలికి వెళ్లొద్దని హితవు చెప్పారు ఆచార్య చాణక్య. అబద్ధాలు అప్పటికప్పుడు ప్రయోజనాలు ఇస్తాయి కానీ, తదుపరి కాలంలో ఇల్లు, జీవితం రెండింటినీ నాశనం చేస్తాయి. అంతేకాదు, ఎదుటి వారి గురించి తప్పుగా ప్రచారం చేయడం కూడా చెడు అలవాటుగా పేర్కొన్నారు. ఈ అలవాట్లు జీవితంలో దుఃఖాన్ని కలుగజేస్తాయన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..