AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశి వారిని అదుపు చేయడం చాలా కష్టం.. మొండి పట్టుదలకు కేరాఫ్ అడ్రస్.. ఇందులో మీరున్నారా?

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, కొన్ని రాశుల వ్యక్తులను నియంత్రించడం చాలా కష్టం. ఈ వ్యక్తులు మొండి పట్టుదలగలవారు మాత్రమే కాదు, వారి స్వంత నిర్ణయాలను మాత్రమే ఇష్టపడతారు. ఇలాంటి వారిలో మీరున్నారేమో ఇప్పుడు చూద్దాం..

Zodiac Signs: ఈ రాశి వారిని అదుపు చేయడం చాలా కష్టం.. మొండి పట్టుదలకు కేరాఫ్ అడ్రస్.. ఇందులో మీరున్నారా?
Zodiac
Venkata Chari
|

Updated on: Jun 05, 2022 | 6:20 AM

Share

జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. ఒక్కో రాశికి ఒక్కో స్వభావం ఉంటుంది. దీన్ని బట్టి వ్యక్తుల స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, కొన్ని రాశుల వ్యక్తులను నియంత్రించడం చాలా కష్టం అంట. ఈ వ్యక్తులు మొండి పట్టుదలగలవారు మాత్రమే కాదు, వారి స్వంత నిర్ణయాలను మాత్రమే ఇష్టపడతారంట. ఇలాంటి వారిలో ఆరు రాశుల వారు ఉన్నారంట. వీరిని నియంత్రించాలనుకోవడం చాలా కష్టమని జ్యోతిష్యులు చెబుతున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

మేషం – మేషరాశి వారిని ప్రభావితం చేయడం చాలా కష్టం. వారు చూడ్డానికి చాలా సరళంగా ఉంటారు. కానీ వారి బలమైన నాయకత్వానికి పేరుగాంచారంట. ఈ వ్యక్తులు తమ స్వంత మార్గాన్ని రూపొందించుకోవాలని బలంగా నమ్ముతారంట. వారిని చంచల మనస్తత్వం లేదా శూన్య మనస్తత్వం అని పొరబడితే.. తప్పులో కాలేసినట్లే.

మిథునం – ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా గోప్యంగా ఉంటారు. వారి అభిప్రాయాన్ని తమలో తాము ఉంచుకుంటారు. వారు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఈ వ్యక్తులు ప్రతి పరిస్థితిలో తమను తాము ఎలా బలంగా ఉంచుకోవాలో మాత్రం బాగా తెలుసంట. వీరి మనసులో జరుగుతున్న విషయాలను గుర్తించడం చాలా కష్టం.

తుల రాశి- ఈ రాశి వారు ఎవరిపైనా ఆధారపడరు. ఈ వ్యక్తులు తమపై చాలా విశ్వాసం కలిగి ఉంటారు. ఒకరి నుంచి సహాయం కోరుతున్నప్పుడు కూడా, వారు తమలో తాము సమర్థులమని భావిస్తారు. ఈ రాశిచక్రంలోని వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుకుంటారు.

వృశ్చికం – ఈ రాశిచక్రం వ్యక్తులు రహస్యంగా అలాగే తారుమారు చేయడంలో నిపుణులుగా పేరుగాంచారు. వీరిని మోసం చేయడం ఎవరికీ అంత సులభం కాదు. ఈ రాశివారిని ఆడుకోలేరు. వారి మనస్సుతో ఆడుకోవడం వల్ల కలిగే పరిణామాలు తరచుగా ప్రాణాంతకంగా మారొచ్చు. వీరు ఎక్కువగా స్వంత ఆలోచనా విధానాలకే కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారు తమ చుట్టూ తిరగడానికి ఎవరినీ అనుమతించరు.

ధనుస్సు – ధనుస్సు రాశి వారు తమ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరిని ఇతరుల నిర్ణయాలకు అనుగుణంగా ఒప్పించడం చాలా కష్టం. ఈ రాశిచక్రం వ్యక్తులు మంచి శ్రోతలు. కానీ, వారు తమ మనస్సు చెప్పినట్లు మాత్రమే చేస్తుంటారు.

మకరం- మకరం రాశి వారు చాలా నిష్కలంగా, నిజాయితీగా ఉంటారు. కానీ వీరిని నియంత్రించడం కూడా చాలా కష్టమైన పని. ఈ వ్యక్తులు ఖచ్చితంగా ఇతరుల మాట వింటారు. కానీ, వారు ఆ ఆదేశాలను గుడ్డిగా అనుసరిస్తారని మాత్రం ఆశించడం తప్పు. అంటే ఇతరుల మాటలను విన్నట్లు నటిస్తారంతే.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం ఊహలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. TV9Telugu.com ఎలాంటి నమ్మకాన్ని, సమాచారాన్ని ఆమోదించదు. ఈ సమాచారాన్ని విశ్వసించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మంచిది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!