Crow: కాకి అరుపు వినిపించిన దగ్గర ఈ ఒక్క పని చేయండి.. అవి మనకు ఏం చెబుతాయంటే.?

కాకి జ్యోతిష్యం, పితృ దేవతలకు సంబంధం, ఆపదలను పసిగట్టే సామర్థ్యం, శని వాహనంగా దాని ప్రాముఖ్యత, మానవ ఆత్మను గుర్తించే శక్తి వంటి అనేక అంశాలను జ్యోతిష్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. పక్షులను సంరక్షించడం ద్వారా ప్రకృతితో మన అనుబంధాన్ని పెంపొందించుకోవాలన్నారు.

Crow: కాకి అరుపు వినిపించిన దగ్గర ఈ ఒక్క పని చేయండి.. అవి మనకు ఏం చెబుతాయంటే.?
Crow

Updated on: Mar 11, 2026 | 9:22 PM

వేదాలు, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రాలలో కాకికి అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. కాకి అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు, అది అనేక ఆధ్యాత్మిక, ప్రాకృతిక రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్న జీవి. దీనికి కాకప్రశ్న, పిటకప్రశ్న వంటి ప్రత్యేక శాస్త్రాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా భవిష్యత్తును, అదృష్టాన్ని అంచనా వేయవచ్చు. పక్షులలో కాకిని వార్తా సందేశాన్ని అందించే మీడియంగా పరిగణిస్తారు. లోకులు కాకులు అనే సామెత దీని ప్రాముఖ్యతను సూచిస్తుంది. కాకి కర్మ ఫలాలను అందించే పక్షిగా కూడా ప్రసిద్ధి చెందింది. నవగ్రహాలలో ఏ గ్రహానికి కూడా పక్షి వాహనం లేకపోగా, శని గ్రహానికి మాత్రమే కాకవాహనం ఉంది. శని కర్మ ఫలాలను నిర్ణయించి, మనుషుల సుఖ దుఃఖాలను శాసించే న్యాయాధిపతి. కాకి ఆయనకు వాహనంగా ఉండటం, ఆత్మలను పరిశీలన చేసే శక్తికి ప్రతీక.

ఇది చదవండి: మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే డబ్బే డబ్బు..

కాకికి ఒకే కన్ను కనిపించినా(రాముడి శాపం వల్ల), అది ప్రపంచంలో వచ్చే విపత్తులను ముందుగానే పసిగట్టగలదు. ఇటీవల టర్కీలో భూకంపం సంభవించడానికి కొద్ది నిమిషాల ముందు కాకులు గుమిగూడి అరిచి, హెచ్చరించిన సంఘటన దీనికి నిదర్శనం. సూర్యోదయం తర్వాత అస్సలు పడుకోని పక్షి కాకి. ఇది బ్రాహ్మీ ముహూర్తంలోనే చురుకుగా ఉంటుంది. గ్రహణ సమయంలో, సూర్యాస్తమయం తర్వాత కాకి ఆహారాన్ని ముట్టదు, ఇది దాని ప్రత్యేకమైన స్వభావం. మన పితృ దేవతల నుంచి తక్షణ శక్తిని పొందాలంటే, కాకులకు ఆహారం అందించడం ఒక పురాతన సంప్రదాయం. పూర్వకాలంలో ప్రతిరోజూ ఇంట్లో వండిన అన్నంలో కొంత భాగం కాకి పిండంగా ఇంటి బయట పెట్టేవారు. కూకట్‌పల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11:10 గంటలకు కాకులు బలి అన్నం తినడానికి కచ్చితంగా వస్తాయని నిపుణులు ఉదాహరణగా పేర్కొన్నారు. కాకులు అన్నం ముట్టకపోతే, అది ప్రేత ఆత్మలకు ఏదో దోషం లేదా తీరని కోరికలు ఉన్నాయని అర్థం. అప్పుడు కాకప్రశ్న వేసి పరిహారాలు చేస్తారు.

ఇది చదవండి: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..

కాకులకు దివ్య శక్తులు కూడా ఉన్నాయని అంటారు. నిధులున్న ప్రదేశాల దగ్గర కాకులు గూడు కట్టుకుంటాయని వైర్తాలికా తంత్రం చెబుతుంది. శత్రువుల వస్త్రాన్ని కాకికి చూపిస్తే, అది శత్రువు ఎక్కడున్నా పసిగట్టగలదట. కాకి నుండి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం స్వీయ-నిర్మాణం, పరోపకారం. అది తన గూడును తానే కట్టుకుంటుంది, కోకిల పిల్లలను సైతం తన పిల్లలుగా ప్రేమగా పెంచుతుంది. సనాతన ధర్మంలో కాకికి ఉన్న ఈ ప్రాముఖ్యత ఈజిప్ట్ పిరమిడ్‌ల వద్ద కూడా కనిపిస్తుంది, అక్కడ గరుడ పక్షి, గుడ్లగూబతో పాటు కాకి మాత్రమే కనిపిస్తుంది. కాకిని రైతు మిత్రుడు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అది వేప పండ్లను తిని విత్తనాలను వ్యాప్తి చేయడం ద్వారా అడవుల పెంపకానికి తోడ్పడుతుంది. చివరగా, మనము ప్రకృతిని, పక్షులను సంరక్షించుకోవాలి. ముఖ్యంగా వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చడానికి ఇంటిపై నీరు ఉంచడం వంటి చిన్న సహాయాలు చేయాలి. ప్రకృతి చక్రం నిరంతరం కొనసాగుతుంది, మన ఆత్మను గుర్తుపట్టే పక్షులు, ముఖ్యంగా కాకి, ఈ జన్మలో మనం వాటికి చేసిన సాయాన్ని వచ్చే జన్మలో కూడా గుర్తిస్తాయని వివరించారు. మన అంతరాత్మను గుర్తించే శక్తి కాకికి మాత్రమే ఉంది.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

Follow Us