AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaganti Koteswara Rao: జీవితంలో పెళ్లి ఎందుకు అనుకుంటున్నారా..? చాగంటి గారు ఏమన్నారంటే..?

చాగంటి కోటేశ్వరరావు గారు ఓ ప్రవచనంలో పితృఋణం తీర్చుకోవడంలో వివాహం ప్రాముఖ్యతను వివరించారు. వివాహం ద్వారా సంతానం పొంది, వేరొకరికి జీవితాన్ని ఇవ్వడం ద్వారా పితృఋణం తీరుతుందని, ఋషి ఋణం, దేవ ఋణం తీర్చుకోవడానికి కూడా వివాహం అవసరమని ఆయన వివరించారు. మహాభారతంలోని జరత్కారు ఉపాఖ్యానం ద్వారా ఈ విషయాన్ని వివరించారు.

Chaganti Koteswara Rao: జీవితంలో పెళ్లి ఎందుకు అనుకుంటున్నారా..? చాగంటి గారు ఏమన్నారంటే..?
Chaganti Koteswara Rao
Ram Naramaneni
|

Updated on: Sep 18, 2025 | 7:58 PM

Share

ఈ జనరేషన్‌ యువత కొందరు పెళ్లి అనే మాట వినడానికి ఇష్టపడటం లేదు. బాబోయ్.. ఈ సంసార సాగరాన్ని మేం ఈదలేం అంటున్నారు. 30 దాటినా ఇప్పటికే చాలామంది సింగిల్‌గానే ఉంటున్నారు. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఓ ప్రవచనంలో వివాహ ప్రాముఖ్యతను వివరించారు.  వివాహం కేవలం సామాజిక సంప్రదాయం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంస్కారం అన్నారు. ఈ ప్రవచనంలో.. ఆయన మూడు ప్రధానమైన ఋణాలను తీర్చుకోవడంలో వివాహం పోషించే పాత్రను వివరించారు. మొదటిది పితృఋణం. తల్లిదండ్రులు తమ పిల్లలకు శరీరాన్ని ఇచ్చినట్లు, వారు కూడా వేరొకరికి జీవితాన్ని ఇవ్వాలి. అందుకే వివాహం ద్వారా సంతానం పొందడం అవసరం. మహాభారతంలోని జరత్కారు ఉపాఖ్యానం ద్వారా ఈ విషయాన్ని ఆయన సమర్థించారు. జరత్కారు పెళ్లి చేసుకోకపోవడం వల్ల, ఆయన తల్లిదండ్రులు, వంశీయులు కష్టాలను అనుభవించారని మహాభారతం ఆదిపర్వం వివరిస్తుందని ఆయన తెలిపారు.

రెండవది ఋషిఋణం. ఋషులు నిస్వార్థంగా మనకు వేదాలు, ఇతిహాసాలను అందించారు. జాతి హితం కోసం వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనం ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి. కానీ వేదాధ్యయనం చేయడానికి ఒక గృహస్థునికి భార్య సహాయం ఎంతో అవసరం. ఆమె ఇంటిని, పిల్లలను చూసుకుంటూ, భర్తకు వేదాధ్యయనం చేయడానికి సహాయపడుతుంది అన్నారు.

మూడవది దేవఋణం. దేవతల అనుగ్రహం చేతనే మనం జీవించగలుగుతున్నాం. యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా మనం దేవ ఋణాన్ని తీర్చుకోవాలి. ఈ క్రతువులను ధర్మపత్నితో కలిసి చేయడం ద్వారా మరింత పుణ్యఫలం లభిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారి ఈ ప్రవచనం మన జీవితంలో వివాహం ప్రాముఖ్యతను బలంగా నొక్కి చెబుతుంది. ఇది కేవలం సంతానోత్పత్తికే కాదు, మన ధర్మాన్ని నెరవేర్చడానికి, మూడు ఋణాలను తీర్చుకోవడానికి అత్యవసరమైనది అని ఆయన అభిప్రాయం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?