Telugu News Spiritual The Divine Form of Brahma Why Wearing the 4 Mukhi Rudraksha is Auspicious for Mercury Ruled Zodiac Signs details in telugu
Rudraksha Benefits: ఈ రుద్రాక్షతో మీ లైఫ్ ఛేంజ్! సాక్షాత్తు బ్రహ్మ స్వరూపం మీ అదృష్టాన్ని ఎలా మారుస్తుందంటే..
'రుద్ర' అంటే ఆ మహా శివుడు, 'అక్ష' అంటే కన్నులు. అందుకే శివుడి త్రినేత్రాల నుండి జాలువారిన బాష్పాల నుండి ఉద్భవించిన చెట్టు విత్తనాలను రుద్రాక్షలుగా పురాణాలు పేర్కొన్నాయి. ఆ మహిమాన్విత రుద్రాక్షలు పరమ పవిత్రం, శక్తివంతం. వీటి ధారణతో అనేక శుభాలు కలుగుతాయి. కష్టాలు దూరమవుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముక్తిని ప్రసాదిస్తుందని దేవీ భాగవతం, శివ పురాణం వంటి అనేక గ్రంథాలలో వీటి వైశిష్టత గురించి చెప్పారు. అందుబాటులో ఉన్న 21 రకాల రుద్రాక్షలలో ఒకటి... చతుర్ముఖ రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ఎవరు ధరించాలి, దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరమ శివుడి కన్నీటి బిందువుల నుండి పుట్టిన రుద్రాక్షలు అత్యంత పవిత్రమైనవి. ముఖ్యంగా చతుర్ముఖ రుద్రాక్ష ధారణతో జ్ఞానం, వాక్చాతుర్యం పెరుగుతాయి. బుధ గ్రహ ప్రభావం బలపడుతుంది. చతుర్ముఖ రుద్రాక్ష నాలుగు ముఖాలు కలిగి ఉంటుంది. పురాణాలు ఈ రుద్రాక్షను చతుర్ముఖుడైన బ్రహ్మ స్వరూపంగా పేర్కొంటాయి. ఈ రుద్రాక్ష నాలుగు వేదాలు, సత్యం, జ్ఞానం, సృష్టి, ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోంది?
చతుర్ముఖ రుద్రాక్షను నియంత్రించే గ్రహం బుధుడు (Mercury). అందుకే జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు, బుధ మహాదశ ప్రభావం ఎదుర్కొంటున్నవారు ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
ఏయే రాశుల వారు ధరించాలి?
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, చతుర్ముఖి రుద్రాక్షను ఈ ఆరు రాశులు వారు ధరించాలి:
వృషభ రాశి
మిథున రాశి
కన్య రాశి
తుల రాశి
మకర రాశి
కుంభ రాశి
రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు
చతుర్ముఖి రుద్రాక్షను బ్రహ్మ స్వరూపంగా పూజించడం వల్ల ఈ శుభ ఫలితాలు ఉంటాయి:
జ్ఞానం వృద్ధి: దీనిని ధరించడం వల్ల జ్ఞానం, బుద్ధి, ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యం పెరుగుతాయని శాస్త్రాలలో చెప్పారు.
బుధ గ్రహ బలం: జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారికి ఇది అత్యంత శుభ ఫలితాలు అందిస్తుంది. బుధుడు వ్యాపార వాణిజ్యాలకు అధిపతి. అందువల్ల ఈ రుద్రాక్ష ధారణతో వ్యాపారస్తులకు వారి నిర్ణయాలలో స్పష్టత లభించి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
విద్యార్థులకు మేలు: విద్యార్థులు ఈ రుద్రాక్షను రాశితో సంబంధం లేకుండా ధరించవచ్చు. జ్ఞాపకశక్తి పెరగడానికి, చదువుపై శ్రద్ధ నిలపడానికి ఇది ఉపయోగకరం.
వృత్తి నిపుణులకు: ఉపాధ్యాయులు, రచయితలు, వక్తలు, జర్నలిస్టులు దీన్ని ధరించడం ద్వారా ఆలోచనలో స్పష్టత, మాటలో ధైర్యం, స్మరణశక్తి పెరుగుతాయని చెప్పబడింది.
ఆరోగ్య మద్దతు: ఆయుర్వేదం ప్రకారం, మానసిక సమస్యలు, అనారోగ్యం ఉన్నవారికి దీని ధారణ ప్రయోజనం ఉంటుంది. ఈ రుద్రాక్ష ధారణ విశుద్ధ చక్రం జాగృతికి సహాయపడి, గొంతు, శ్వాస, నాడీ సంబంధిత సమస్యలు తొలగడానికి దోహదపడుతుంది.
ఎప్పుడు, ఎలా ధరించాలి?
చతుర్ముఖి రుద్రాక్ష ధరించడానికి ఉత్తమమైన రోజు బుధవారం. ఆ రోజే కాదు మాస శివరాత్రి, శివరాత్రి, కార్తీక మాసం, ఏదైనా సోమవారం, పౌర్ణమి రోజుల్లో కూడా ధారణ శుభప్రదం.
ధారణ విధానం: వెండి లేదా బంగారంతో మాలగా చేసి ధరిస్తే మంచిది.
శుద్ధి: ధారణకు ముందు ఆవుపాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. శివలింగం దగ్గర అభిషేకం చేసి, ఉదయం $6$ గంటల తరువాత ధరించాలని పురాణాలు చెబుతున్నాయి.
నియమాలు: రుద్రాక్ష ధారణకు కఠినమైన నియమాలు లేవు. ఎవరైనా ధరించవచ్చు. కాకపోతే అపవిత్రం చేయవద్దు.