ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?

|

Mar 29, 2021 | 9:37 PM

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో పురాతన ఆలయం బయటపడింది. జైనథ్‌ మండలం గిమ్మా గ్రామ శివారులో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆలయం వెయ్యేళ్ల క్రితం నాటి...

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?
Temple Ruins
Follow us on

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో పురాతన ఆలయం బయటపడింది. జైనథ్‌ మండలం గిమ్మా గ్రామ శివారులో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆలయం వెయ్యేళ్ల క్రితం నాటి ఆలయమని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఈ ఆలయాన్ని రాక్షసరాజులు నిర్మించినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో నాగదేవత, గణపతి దేవుడుతోపాటు పలు రాతి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఆలయ ముఖద్వారం తూర్పువైపు కాకుండా పడమరవైపు నిర్మాణం చేపట్టడంతో.. మధ్యలోనే ఆపేసినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ఆలయాన్ని రాక్షసరాజులు నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ శిథిలావస్థకు చేరుకుంది.

రాతితో చెక్కిన పదుల సంఖ్యలో విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని స్థానికులు చంద్రనారాయణ స్వామి ఆలయంగా పిలుచుకుంటారని పక్షి ప్రేమికుడు లింగంపల్లి కృష్ణ తెలిపారు. అడవిలో పక్షుల పోటోలు తీసేందుకు వెళ్లి‌న సమయంలో గిమ్మా శివారులోని దట్టమై‌న అడవిలో ఈ ఆలయం కనిపించినట్టుగా కృష్ణ వివరించాడు. ఆలయ శిథిలాల్లో అద్భుతమైన దేవత విగ్రహం ఉండడం విశేషం. రాతితో చెక్కిన మరెన్నో విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి.

Also Read: ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరిస్తారు? దీని వెనుక కారణం ఇదే

మాంత్రికుడి మాటలు విని.. గుప్త నిధుల కోసం 50 అడుగుల గొయ్యి.. అదే వారి ప్రాణాలు తీసింది