ఆలయాల్లో భక్తుల దర్శనాలు రద్దు చేశారు. ఈ నెల 21 వరకు దర్శనాలు నిలిపివేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే బాసర సరస్వతీ క్షేత్రంలో అమ్మవారి గర్భగుడికి అర్చకులు తాళం వేసి వెళ్లిపోయారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని జ్ఞాన సరస్వతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తప్పుపట్టారు. టీవీ చానల్ లో నిరాధారమైన ప్రచారం చేస్తున్నారు అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా కండిస్తున్నాము అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మి భక్తులు ఆందోళనకు గురికాకూడదని పేర్కొన్నారు. అమ్మవారికి నిత్యం జరిగే అభిషేక అలంకరణ నైవేద్య నీరాజన మంత్రపుష్ప సేవలో ఎలాంటి లోపము జరగలేదని వివరణ ఇచ్చుకున్నారు. బుధవారం జరిగిన సీసీటీవీ వీడియోను కూడా వారు విడుదల చేశారు.
ఓం శ్రీ సరస్వత్యై నమః
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి సంపూర్ణ లాక్డౌన్ విధించిన కారణంగా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ దేవస్థానం నందు భక్తులకు దర్శనములు మరియు ఆర్జిత సేవలు నిలుపుదల చేయడమైనది దేవస్థానము నందు అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలు కైంకర్యములు అన్నీ కూడా దేవస్థాన అర్చక బృందం చే ఆంతరంగికంగా నిర్వహించబడును
ఈరోజు ఉదయం పూజలు చేయలేదని అమ్మవారి గర్భాలయానికి తాళం వేశారని టీవీ చానల్ లో నిరాధారమైన ప్రచారం చేస్తున్నారు అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా కండిస్తున్నాము భక్తులెవరు ఇట్టి ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికాకూడదని తెలియపరుస్తూ అమ్మవారికి నిత్యం జరిగే అభిషేక అలంకరణ నైవేద్య నీరాజన మంత్రపుష్ప సేవలో ఎలాంటి లోపము జరగలేదని తెలియజేస్తున్నాముసమాచారనిమిత్తము సంబంధిత సీసీ టీవీ ఫుటేజ్ మరియు అభిషేక పూజాధికములు నిర్వహించిన అర్చకుల వాంగ్మూలం వీడియో ఇందువెంట జతపర్చడమైనది
ఇట్లు
కార్యనిర్వహణాధికారి
జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర