సాయంత్రం 6 దాటితే ఈ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు.. ! ఎందుకో తెలుసా..?

సాయంత్రం 6 గంటల తర్వాత డాకినీ మాత స్వయంగా ఆలయ సముదాయాన్ని సందర్శిస్తుందని నమ్ముతారు. అమ్మవారు ఆలయంలో తిరుగుతున్న సమయంలో ఎవరూ చూడకూడదని ఇక్కడ ప్రజల నమ్మకం. అలా చూస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సిందని అంటారు.. అందుకే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించడం నిషిద్ధం. ఈ సమయంలో ఆలయ పూజారులు కూడా గుడి నుండి వెళ్లిపోతారు. సాయంత్రం హారతి అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.

సాయంత్రం 6 దాటితే ఈ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు.. ! ఎందుకో తెలుసా..?
Temple in bihar

Updated on: Dec 26, 2023 | 3:15 PM

దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటి చరిత్ర కూడా చాలా పురాతనమైనది. అదేవిధంగా ఒక్కో ఆలయంలో పూజా విధానం కూడా ఒక్కో విధంగా ఉంటుంది. అలాగే, ప్రతి దేవాలయం తెరవడం మరియు మూసివేసే సమయం కూడా భిన్నంగా ఉంటుంది. చాలా ఆలయాలు ఉదయం 5 గంటలకు తెరుచుకుంటాయి. మరికొన్ని ఆలయాలు ఉదయం 8 గంటలకు తెరుస్తారు. అదేవిధంగా చాలా ఆలయాలు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మూసివేస్తారు. తిరిగి నాలుగు గంటలు దాటిన తర్వాత తిరిగి తెరుస్తారు. మరికొన్ని ఆలయాలు మాత్రం రోజంతా తెరిచే ఉంటాయి. అయితే, సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఈ గుడి ఎక్కడ ఉంది..? దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఆలయం బీహార్‌లోని మాధేపూర్ జిల్లా ఆలంనగర్ తాలూకాలోని ఒక గ్రామంలో ఉంది. డాకిని అని పిలువబడే ఈ దేవాలయం పురాతనమైనది. ఈ గుడిలోని దేవుడికి రోజంతా 5 సార్లు హారతి నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. తిరిగి ఆ మార్నాడు ఉదయం 6 గంటలకు మాత్రమే తెరుస్తారు.

సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయానికి వెళ్లడానికి ఎందుకు అనుమతి లేదు?: ఇక్కడి ప్రజల విశ్వాసాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత డాకినీ మాత స్వయంగా ఆలయ సముదాయాన్ని సందర్శిస్తుందని నమ్ముతారు. అమ్మవారు ఆలయంలో తిరుగుతున్న సమయంలో ఎవరూ చూడకూడదని ఇక్కడ ప్రజల నమ్మకం. అలా చూస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సిందని అంటారు.. అందుకే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించడం నిషిద్ధం. ఈ సమయంలో ఆలయ పూజారులు కూడా గుడి నుండి వెళ్లిపోతారు. సాయంత్రం హారతి అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.

ఇవి కూడా చదవండి

ఆలయ చరిత్ర: ఈ ఆలయం 1348లో స్థాపించబడింది. ఈ ఆలయాన్ని దుర్గామాత దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారికి మేకలను బలి ఇస్తారు. చాలా ఏళ్లుగా ఇక్కడ ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. ఇది పూజలో అత్యంత కీలకమైన ఘట్టంగా చెబుతారు. అంతేకాదు ఇక్కడి అమ్మవారికి లడ్డూలు నైవేద్యంగా పెట్టడం శుభప్రదంగా భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..