Yadadri: రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి: స్వరూపానందేంద్ర సరస్వతి

|

Oct 23, 2021 | 8:38 AM

కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన యాదాద్రి ఆలయ నిర్మాణంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి

Yadadri: రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి: స్వరూపానందేంద్ర సరస్వతి
Yadadri Kcr
Follow us on

Yadadri Temple: కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన యాదాద్రి ఆలయ నిర్మాణంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి స్పందించారు. హిందువుల మనోభావాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నాయన్న ఆయన, తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్‌ పాలన సాగుతోందని కితాబిచ్చారు. రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని ఆయన కీర్తించారు.

సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్.. ఆయన సాధించిన మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు యాదాద్రి నిర్మాణం కూడా చిరస్థాయిగా నిలుస్తుంది. అని స్వరూపానందేంద్ర స్వామి వ్యాఖ్యానించారు. యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. వేద పారాయణ పోస్టుల ద్వారా తెలంగాణలో బ్రాహ్మణులకు అవకాశాలు కల్పించాలని స్వరూపానందేంద్ర డిమాండ్ చేశారు.

Yadadri

Read also: Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..