Mahabubnagar: అక్టోబర్ 26 నుంచి వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు..

|

Oct 11, 2022 | 9:43 PM

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు..

Mahabubnagar: అక్టోబర్ 26 నుంచి వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు..
Kurumurthy Swamy Brahmotsavam
Follow us on

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రెవెన్యూ సమావేశ మందిరంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాదారు. గత ఏడాది కన్నా ఈమారు కురుమూర్తి బ్రహ్మోత్సవాలను మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ ఏడాది అక్టోబర్ 26 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్ల కోసం ఎలాంటి నిధుల కొరత లేదని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ నుండి పారిశుద్ధ సిబ్బందితోపాటు, జిల్లాలోని మూడు మున్సిపాలిటీల నుండి కూడా పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మంత్రి అన్నారు.

ఇవి కూడా చదవండి

మహబూబ్ నగర్- అమ్మాపూర్, కొత్తకోట- అమ్మాపూర్ రహదారులను ముందే తనిఖీ చేసి ఎక్కడైనా గుంతలు ఉన్నట్లయితే పూడ్చాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలు భాగంగా ఈనెల 30న అలంకరణ..31 ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం జరగనుంది.. అంతకుముందు బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఆవిష్కరించారు.