Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం

|

Nov 19, 2024 | 11:33 AM

బంగారు రథంలపై ఊరేగుతుండగా ఆలయ అర్చకులు, వేద పండితులు రథంపై కొలువైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం జరుగుతుండగా రథం ఎదుట మహిళల కోలాటాలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఆకట్టుకున్నారు.

Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం
Swarna Rathotsavam
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీశైలంలో శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వైభవంగా స్వర్ణరథోత్సవం నిర్వహించారు. దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం జరిపించారు. స్వర్ణరథంపై ఆసీనులై ఉన్న శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర హారతులు సమర్పించారు.

అనంతరం స్వర్ణరథోత్సవం ఆలయ రాజగోపురం నుండి ఆలయం మాడవీధులలోని హరిహరరాయ గోపురం,బ్రహ్మానందరాయ గోపురం,శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా స్వర్ణరథోత్సవం జరిగింది బంగారు స్వర్ణరథోత్సవం ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఈ వేడుకను తిలకించేందుకువందలాదిగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వర్ణ రథోత్సవాన్ని కన్నులారా తిలకించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు బంగారు రథంలపై ఊరేగుతుండగా ఆలయ అర్చకులు, వేద పండితులు రథంపై కొలువైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం జరుగుతుండగా రథం ఎదుట మహిళల కోలాటాలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఆకట్టుకున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..