స్వప్న శాస్త్రం ప్రకారం నిద్రలో వచ్చే ప్రతి కల భవిష్యత్ లో జరగనున్న సంఘటనలను సూచిస్తుంది. అదే విధంగా ప్రతి కలకి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. కొన్ని కలలు చాలా కష్టాలను తెచ్చిపెడితే, కొన్ని కలలు శుభాలను సూచిస్తాయి. జంతువులు పక్షులు వంటివి మాత్రమే కాదు కలలో మరికొన్ని రకాల సంఘటలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి కలల్లో ఒకటి ఎడుస్తున్నట్లు కనిపించడం. కలలో ఏడుస్తూ ఉన్నట్లు కనిపించడం అనేది సాధారణ విషయం కాదు. స్వప్న శాస్త్రంలో కూడా ఈ కలకి ప్రత్యేక అర్ధం ఉంది. కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపించినా.. లేక ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపించినా దానికి కూడా ప్రత్యేక అర్ధం ఉంది. కొన్ని ఏడ్పు కలలు జీవితంలో ఏదైనా మంచి జరగనుందా.. లేక చెడు జరగనుందా అన్నదానికి సంకేతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే దానికి అర్ధం ఏమిటో తెలుసుకుందాం..
డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీ ఆయుస్సు నిండు నూరేళ్ళు అని అర్ధం.. మీ జీవితం సుదీర్ఘంగా ఉంటుందని.. జీవితంలో చాలా ఆనందాన్ని పొందబోతున్నారని ఈ కల సూచిస్తుంది. కలలో ఏడుపు కూడా ఆర్థిక లాభాలను సూచిస్తుంది. కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది అంటే మీకు ఏదైనా అవార్డు అందుకునే చాన్స్ ఉంది లేదా మీ ప్రణాళికలలో ఒకటి విజయవంతం కావచ్చు లేదా కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మీరు మీ కలలో బిగ్గరగా ఏడుస్తున్నట్లు కనిపిస్తే.. అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ కల భవిష్యత్తులో మీకు ఏదైనా మంచి జరుగనున్నదని సూచిస్తుంది. అంతేకాదు జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగనుందని ఈ కలకు అర్ధం అట.
కలలో మీరు బిగ్గరగా ఎడుస్తున్నట్లు కనిపిస్తుంది అంటే మీరు మీ కెరీర్ లేదా వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు. ఏదైనా పని అనుకోని ఆటంకాల వలన నిలిచిపోయినట్లయితే.. అది కూడా పూర్తవుతుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది.
అదే సమయంలో.. మీ కలలో ఇతర వ్యక్తి ఏడుస్తున్నట్లు కనిపిస్తే.. అది జీవితంలో సమస్యలకు సంకేతం కావచ్చు. ఇలాంటి కలలు చేపట్టిన పనిలో కొంత తప్పు జరగవచ్చని లేదా ఎవరితోనైనా మీ సంబంధం చెడిపోవచ్చని ఈ కల ముందస్తుగా సూచిస్తుంది.
కలలో మీరు ఏడుస్తున్నట్లు మీకే కనిపిస్తే డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో ఏడుపు అంటే మీ కోరికలు కొన్ని నెరవేరబోతున్నాయని లేదా మీ కెరీర్‌లో సానుకూల మార్పులు ఉండవచ్చని కూడా అర్థం. మీరు పెళ్లికాని అయితే మీ కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే.. త్వరలో పెళ్లి కుదరవచ్చు అని అర్థం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.