Surya Grahan: గ్రహణ సమయంలో తినే ఆహారంపై తులసి ఆకులను ఎందుకు వేస్తారో తెలుసా..

సైన్స్ కంటే నమ్మకానికి ప్రాధాన్యమిస్తూ.. భారతీయులు గ్రహణం సమయంలో అనేక నియమాలను పాటిస్తారు. అయితే గ్రహణం ఏర్పడే సమయంలో శారీరక , మానసిక ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు ఎల్లప్పుడూ తలెత్తుతాయి.

Surya Grahan: గ్రహణ సమయంలో తినే ఆహారంపై తులసి ఆకులను ఎందుకు వేస్తారో తెలుసా..
Surya Grahan 2022

Updated on: Oct 25, 2022 | 1:22 PM

దీపావళి అమావాస్య తిథి అక్టోబర్ 24, 25 వ తేదీల్లో రెండు రోజులు వచ్చింది. ఈరోజు ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం చివరిది ఏర్పడనుంది.  నివేదికల ప్రకారం సూర్య గ్రహణం రోజు మధ్యాహ్నం 4. 59 గంటలకు సంభవిస్తుంది..  అది సాయంత్రం 5.59 గంటలకు ముగుస్తుంది. పాక్షిక గ్రహణ సమయంలో తినే ఆహారం,  దినచర్యకు సంబంధించిన కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తారు. సైన్స్ కంటే నమ్మకానికి ప్రాధాన్యమిస్తూ.. భారతీయులు గ్రహణం సమయంలో అనేక నియమాలను పాటిస్తారు. అయితే గ్రహణం ఏర్పడే సమయంలో శారీరక , మానసిక ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు ఎల్లప్పుడూ తలెత్తుతాయి.

దీని గురించి అనేక పరిశోధనలు కూడా జరిగాయి.. అయినప్పటికీ ఖచ్చితమైన రుజువు ఏదీ దొరకలేదు. అయినప్పటికీ, ప్రజలు గ్రహణ సమయంలో ఆహార నియమాలను పాటిస్తారు. వీటిలో ఒకటి తులసి ఆకులను ఉపయోగించడం. ఈరోజు గ్రహణం సందర్భంగా తులసి ఆకుని తీసుకోడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెల్సుకుందాం..

గ్రహణ సమయంలో తులసి ఆకు
భారతదేశంలో అనేక మత విశ్వాసాలు గ్రహణంతో ముడిపడి ఉన్నాయి. గ్రహణ సమయంలో తినడం, త్రాగడం నిషేధించబడింది. అంతేకాదు ప్రజలు తినే  ఆహారంలో తులసి ఆకులను వేస్తారు.  అయితే ఇలా తులసి ఆకులను ఆహారంలో తినడం వల్ల గ్రహణానికి ప్రత్యక్ష సంబంధం ఉండదని భావిస్తారు

ఇవి కూడా చదవండి

అందుకే తులసిని ఆహారంలో వేస్తారు
గ్రహణ సమయంలో తులసి తినడం ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, మత విశ్వాసాల ప్రకారం, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణంలో  తులసి ఆకులను చెట్టునుంచి తెంచరాదు. అయితే సూర్యగ్రహణ సమయంలో కిరణాలు వాతావరణంలో ప్రతికూల ప్రభావాన్ని  చూపిస్తాయి. అటువంటి ప్రతికూల ప్రభావాలను తగ్గించే సామర్థ్యం తులసికి ఉందని విశ్వాసం. అందుచేత తులసి ఆకులను ఆహారంలో కలుపుకుని తినాలి.

తులసి ఆకుల ప్రయోజనాలు
ముందు ఆహారపదార్థాలపై తులసి ఆకులు వేసి తినడం అనే విషయంలో సైన్స్ ప్రకారం నిరూపింపబడలేదు. అయినప్పటికీ తులసి ఆకులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తులసికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు,  పాలీఫెనాల్స్ వంటి ముఖ్యమైనవి ఉంటాయి.  కనుక గ్రహణ సమయంలో ఏర్పడే అతినీల లోహిత కిరణాల ప్రభావం నుంచి తులసి రక్షణ ఇస్తుందని కొందరు నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)