Srisailam: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రోజుకి రెండు సార్లు స్పర్శ దర్శనం.. ఏఏ రోజుల్లో దర్శనం కల్పిస్తున్నారంటే..

|

Jan 06, 2022 | 10:13 AM

Srisailam Temple: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆలయ అధికారులు. మల్లన్న ఉచిత స్పర్శదర్శనాలలో మార్పులు చేస్తున్నామని.. మంగళవారం..

Srisailam: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రోజుకి రెండు సార్లు స్పర్శ దర్శనం.. ఏఏ రోజుల్లో దర్శనం కల్పిస్తున్నారంటే..
Srisailam
Follow us on

Srisailam Temple: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆలయ అధికారులు. మల్లన్న ఉచిత స్పర్శదర్శనాలలో మార్పులు చేస్తున్నామని.. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు రెండు సార్లు ఉచిత స్పర్శదర్శనం కల్పించనున్నమని ఈఓ ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే..

శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నట్లు ఈవో  లవన్న ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే గర్భాలయ ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తూ ఉన్నారు. అయితే వివిధ ప్రాంతాల భక్తుల అభ్యర్థన మేరకు సాయంకాలం కూడా ఉచిత స్పర్శదర్శనం కల్పించేందుకు నిర్ణయించామని తెలిపారు.

అయితే వారంలో నాలుగు రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అనుమతించగా.. గురువారం మాత్రం ఆలయ శుద్ధి చేసుకునేందుకు వీలుగా 01.30 గంటల నుంచి 02.30 వరకు గర్భాలయ ప్రవేశం ప్రవేశం కల్పించి తిరిగి సాయంకాలం 06.30 నుంచి 07.30 వరకు సామాన్యుల భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలో కేవలం ఆలయ ముఖమండపం నుంచి ప్రవేశం చేసిన వారికి మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అయితే గర్భాలయంలోకి ప్రవేశించే భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని భక్తులకు ఈవో లవన్న చెప్పారు.

Also Read: ఈనెల 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. బ్రేక్ ద‌ర్శనం ర‌ద్దు.. సిఫార్స్ లేఖలు తీసుకురావద్దు ..