Astro Tips: ఉదయం నిద్ర లేవగానే వీటిని అస్సలు చూడొద్దు.. ఒకవేళ చూస్తే అంతే సంగతులు..
Astro Tips: అనేక మత గ్రంధాలలో ఉదయం సమయం చాలా విలువైనదిగా పేర్కొనడం జరిగింది. ఆ సమయంలో మనం పొందే శక్తి రోజంతా మనతోనే ఉంటుంది. ఉదయాన్నే
Astro Tips: అనేక మత గ్రంధాలలో ఉదయం సమయం చాలా విలువైనదిగా పేర్కొనడం జరిగింది. ఆ సమయంలో మనం పొందే శక్తి రోజంతా మనతోనే ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి.. పూజలు, పఠనం, వ్యాయామం చేసిన వారి శరీరం రోజంతా శక్తివంతంగా, ఉత్తేజంగా ఉంటారు. ఇలాంటి వారు చురుకుదనంతో ఉంటారు. అయితే, చాలా మంది ఉదయం లేవగానే కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల వారి మనస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏ పని కూడా సక్రమంగా జరుగదు. ఒక్కోసారి అనవసర వివాదాల్లో తలదూరుస్తారు. అందుకే ధార్మిక గ్రంధాలలో ఉదయం నిద్రలేవగానే భగవంతుని నామాన్ని జపించాలని పేర్కొనడం జరిగింది. అలా చేయడం ద్వారా రోజంతా సానుకూల ప్రభావం చూపుతుందంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని పనులు చేయకూడదు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అద్దంలో చూడొద్దు.. కొందరికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. అయితే, జ్యోతిష్యం ప్రకారం ఇలా చేయకూడదు. దాని కారణంగా ప్రతికూల శక్తి పెరుగుతుంది. దాని ప్రభావం వ్యక్తి యొక్క ఆలోచనలలో ప్రస్ఫూటిస్తుంది. దీని వల్ల వ్యక్తులు తాము చేపట్టిన పనులు ఏమీ ముందుకు కదలవు.
అంట్ల గిన్నెలు.. వాస్తు ప్రకారం.. అంట్ల గిన్నెలను రాత్రి సమయంలో సింక్‌లో ఉంచకూడదు. అయితే మీ వంటగదిలో మురికి పాత్రలు వేసినప్పటికీ, మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ పాత్రలను చూడకండి. అలా చేస్తే దాని వలన ఏర్పడే ప్రతికూల ప్రభావం మీరు చేపట్టే పనులపై చూపుతుంది.
నిలిచిపోయిన గడియారం చూడొద్దు.. ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచకూడదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని అస్సలు చూడొద్దు. అలా చేస్తే ఆ రోజంతా అశుభం జరుగుతుందట. లేనిపోని గొడవలు జరుగుతాయట. ఇంకా సూది గానీ, దారం గానీ చూడొద్దని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనడం జరిగింది.
జంతువుల చిత్రం.. కొంతమంది తమ ఇళ్లలో జంతువుల చిత్రాలను పెట్టుకుంటారు. అయితే, ఉదయం నిద్రలేవగానే వాటిని చూడకూడదు. ఒకవేళ వాటిని చూస్తే ఆ రోజంతా వివాదాలు, గందరగోళాలతో గడిచిపోతుందట. అందుకనే మీరు మీ గదిలో ఏ జంతువు చిత్రాన్ని ఉంచకపోవడమే మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మరి ఏం చేయాలి.. మీరు ఉదయం లేవగానే మీ అరచేతులను చూడాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి అర చేతుల్లోనే దాగి ఉంటుందట. అరచేతిలోకి చూస్తూ ‘కరాగ్రే వసతే లక్ష్మీ: కరమ్ధే సరస్వతి, కర్ములే తు గోవిందః ప్రభాతే కర్దర్శనం’ అని జపించి భగవంతుడిని మనసులో స్మరిస్తూ పూజించాలి.
Also read:
India Corona Cases: జెట్ స్పీడ్‌తో కోరలు చాస్తున్న కరోనా.. 24 గంటల్లో 55 శాతంకు పైగా కేసులు..