Srisailam Temple: మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ.. రెండు రోజులు ఉచిత స్పర్ప దర్శనం రద్దు..
Srisailam Temple: కర్నూలు జిల్లాలోని(Kurnool District) ప్రముఖ శివ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో సామాన్యుల భక్తులు సైతం ఎక్కువ సంఖ్యలో మల్లన్న (Mallanna) దర్శనానికి..
Srisailam Temple: కర్నూలు జిల్లాలోని(Kurnool District) ప్రముఖ శివ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో సామాన్యుల భక్తులు సైతం ఎక్కువ సంఖ్యలో మల్లన్న (Mallanna) దర్శనానికి రావడంతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న భక్తులకు ఉచిత స్పర్శదర్శన నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న ప్రకటించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో మల్లన్న స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం తాత్కాలిక నిలుపుదల చేశారు. మంగళ నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం, సాయంకాల వేళలో భక్తులకు ఉచితంగా స్పర్శదర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం భక్తుల రద్దీ అధికం కావడంతో గతంలో ప్రకటించిన మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని నేడు, రేపు ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేసినట్లు ఈవో లవన్న పేర్కొన్నారు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనై వెనుదిరిగారు.
Also Read:
Rani Karnavati: చరిత్ర చెప్పని పాఠం ఈ యోధురాలు.. ముక్కులు కత్తిరించే రాణిగా ఖ్యాతి..