Srisailam: శ్రీశైలం భక్తులు అలర్ట్, ఆ రోజు నుంచి అన్ని ఆర్జిత సేవలు బంద్

| Edited By: Balu Jajala

Feb 25, 2024 | 8:14 AM

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేది నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు.

Srisailam: శ్రీశైలం భక్తులు అలర్ట్, ఆ రోజు నుంచి అన్ని ఆర్జిత సేవలు బంద్
Srisailam Temple
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేది నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు. ముఖ్యంగా మార్చి 1 వతేది నుండి 11 వతేది వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

ఒక్క జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి 1 నుండి 5వ తేదీ సాయంత్రం 7:30 వరకు నిర్దిష్టవేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. 5 వ తేదీ సాయంత్రం 7:30 నుండి 11 వతేది వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్లైన్,కరెంట్ బుకింగ్ కి ఏర్పాటు చేశామని భక్తులు గమనించి దేవస్థానానికి సహకరించాలని భక్తులను ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.