Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం.. ముగియనున్న బ్రహ్మోత్సవాలు.. మల్లన్న స్పర్శ దర్శనం ప్రారంభం

|

Mar 05, 2022 | 8:19 AM

Srisailam: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని  ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. ఈ మహాక్షేత్రంలో నేటి నుంచి ఆర్జిత సేవ(Arjita Seva)లు పునఃప్రారంభం కానున్నాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన,..

Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం.. ముగియనున్న బ్రహ్మోత్సవాలు.. మల్లన్న స్పర్శ దర్శనం ప్రారంభం
Srisailam
Follow us on

Srisailam: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని  ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. ఈ మహాక్షేత్రంలో నేటి నుంచి ఆర్జిత సేవ(Arjita Seva)లు పునఃప్రారంభం కానున్నాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు ఈరోజుతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీశైలం లో శనివారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం పునఃప్రారంభం కానుంది. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరెంట్, ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 6 నుంచి రోజుకు మూడుసార్లు సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ ఫిబ్రవరి 22న మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. అశ్వవాహనంపై కొలువై స్వామి అమ్మవార్లు పూజలందుకున్నారు. రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయణోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరగా ఏకాంత సేవతో 11 రోజుల నుంచి వైభవంగా జరుగుతోన్న బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Also Read:

మీరు ఒక వ్యక్తిని లొంగదీసుకునే నైపుణ్యాన్ని నేర్చుకోవాలనుకుంటే, ఆచార్య చాణక్యుడి విషయం గుర్తుంచుకోండి.

మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఈసారి తగ్గిన ఆదాయం.. ఇంకా తేలాల్సిన బంగారం, వెండి కానుకల లెక్కలు