తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమవగా.. కలియుగ దైవం శ్రీనివాసునికి సుప్రభాత సేవ వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సుప్రభాత సేవ అనంతరం ఉదయం 6:30 కు తోమాల సేవ, 7:30 కు అర్చన, ఉదయం 9:30 కు రెండవ నివేదన, ఉదయం 10 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ, సాయంత్రం 6:30 కు వీధి ఉత్సవం, రాత్రి ఏడున్నర గంటలకు రాత్రి కైంకర్యం, రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ మొదలైన నిత్యోత్సవాలు నిర్వహణ చేస్తారు. అలాగే వారోత్సవాలైన అష్టదళపాద పద్మారాధన, సహస్రకలశాభిషేకం, తిరుప్పాడవ, పురాభిషేకం నిర్వహిస్తారు.
ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యి ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు తిరుమల మాడవీధుల్లో లాగా తిరుచ్చిపై ఉత్సవ విగ్రహాల ఊరేగింపును భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి జరగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో సాయంత్రం గవర్నర్ తమిళి సై, మంత్రి హరీష్ రావు, బిజెపి ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ దర్శించుకోనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..