Vontimitta Kalyanam: వెన్నెల కాంతుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం.. రాములోరి కల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులు

|

Apr 05, 2023 | 9:42 PM

ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నవమి పండుగ సందర్బంగా శ్రీ సీతారాముల..

Vontimitta Kalyanam: వెన్నెల కాంతుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం.. రాములోరి కల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులు
Vontimitta Kodandarama Kalyanam
Follow us on

కడపజిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి వెన్నెల కాంతుల్లో కోదండరాముడి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు వేదపండితులు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నవమి పండుగ సందర్బంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు. కానీ ఒంటిమట్ట శ్రీ కోదండరాముని కల్యాణోత్సవానికి మాత్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేని విశిష్ఠత ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్బంగా చైత్ర శుద్ద చతుర్దశి నాడు అది కూడా రాత్రి పూట మాత్రమే కల్యాణోత్సవం నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం ప్రాంగణంలో 52 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. పండువెన్నెల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు వేదపండితులు.

ఒంటిమిట్టలో పురాణాల ప్రకారం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా శ్రీరాముడు రాత్రి సమయంలో కల్యాణం చేసుకుంటారని వేదపండితులు వెల్లడించారు. సాయంత్రం కాంతకోరిక పేరుతో కార్యక్రమం నిర్వహించే పండితులు..ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. 11వ శతాబ్దం నుంచి ఒంటిమిట్టలో కోదండరాముడికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం