శ్రీరామనవమి వేడుకకు భద్రాచలం(Bhadrachalam) ముస్తాబైంది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న రాములవారి కల్యాణానికి ఆలయం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయంగా పేరొందిన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో 2022, మార్చి 18వ తేదీన ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 10వ తేదీన శ్రీరామనవమి(Sri Ramanavami) పండుగ సందర్భంగా నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో ఉన్న మూలమూర్తులు, ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయ ప్రకారం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దంచి పొడి చేసిన పసుపులో తలంబ్రాలు చేశారు. బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10వ తేదీన కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో శివాజీ వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఏటా భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల్లో సీతారామ కల్యాణాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు అందిస్తారు. ఇందు కోసం స్వయంగా రామ పంట పండిస్తారు. దాదాపు 3 నెలలు శ్రమించి 8వందల కేజీలు బియ్యంను గోటితో వలిచి, కోటి తలంబ్రాలు తయారు చేస్తారు. ఈ కార్యక్రమంలో 60 గ్రామాల్లోని రామభక్తులు పాల్గొన్నారు. కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభం కావడంతో సీతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా, 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కోటి తలంబ్రాలు అందిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా భద్రాద్రి ఆలయంలో నిర్వహించే శ్రీరామ కల్యాణం భక్తులు లేకుండానే నిర్వహించే వారు. ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ఈసారి భక్తుల సమక్షంలో శ్రీరామ కల్యాణం నిర్వహించడం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి.
High Temperature: వెదర్ అలర్ట్.. నిప్పుల కుంపటిలా నల్గొండ.. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
Viral Photo: ఈ ఫోటో చూడగానే మీకు ఏం కనిపించింది.? దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..