Vara Lakshmi Vratam: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శుక్రవారం సందండి కళకళలాడింది. ఉదయం నుండే ఆలయాలకు క్యూ కట్టారు. గుళ్లు, ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతంతో పండగ శోభను సంతరించుకున్నాయి తెలుగు లోగిళ్లు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. ఆలయంలో అమ్మవారికి దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ భద్రకాళి దేవస్థానం భక్తులతో నిండిపోయింది.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరంగల్ లోని ఆలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీ గుడి, పద్మాక్ధి దేవాలయం, సంతోషిమాత జ్ఞాన మందిరం, దత్తపీఠంలోని అనఘమహాలక్ష్మి ఆలయాల్లో వరలక్ష్మీవ్రతాలు జరిగాయి. హైదరాబాద్ పలు ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం పూటే ఆలయాలకు తరలివెళ్లారు. అత్యంత భక్తి శ్రధ్దలతో అమ్మవార్లకు పూజలు చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రతి ఇల్లు పండుగ శోభతో కళకళలాడుతోంది.
శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావిస్తారు. మంగళగౌరి దేవిని కలశ రూపంలో ప్రతిష్టించి, మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. తొమ్మిది రకాల పిండి వంటలతో పాటు పండ్లను నైవేధ్యంగా చెల్లిస్తారు. అమ్మవారికి చామంతులు, బంతి పువ్వులు వ్రతంలో సమర్పిస్తారు. ముత్తయిదువులు అంతా కలిసి, ఇళ్లల్లోనే ఈ వ్రతాన్ని చేస్తారు. కొందరు సమీపంలోని అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి వ్రతాన్ని ఆచరిస్తారు.
Read also: Ancient idols: చిత్తూరు జిల్లా పెద్ద గోర్పాడులో బయటపడ్డ పురాతన పంచలోహ విగ్రహాలు