Saturday Puja Tips: శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి.. ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం

|

Aug 24, 2024 | 6:34 AM

శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత. సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పుడు శనీశ్వరుడిని పూజించకూడదు. దీనికి కారణం ఈ సమయంలో సూర్యుడు శని గ్రహం వెనుక ఉండటమే. అంతేకాదు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని కవచాన్ని పఠించాలి. అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి శనివారం మహాదేవుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. ఇది జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది. సమస్యల సుడిగుండాన్ని తగ్గించడం తద్వారా విజయం లభిస్తుంది.

Saturday Puja Tips: శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి.. ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
Lord Shani Dev
Follow us on

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడిని పూజించడానికి శనివారం ప్రత్యేకమైన రోజు. శ్రావణ మాసం శనివారం రోజున శనీశ్వరుడు పూజను ఘనంగా నిర్వహిస్తారు. ఎందుకంటే శివుడు వరప్రసాదం శనీశ్వరుడు.. ఇద్దరూ చాలా సన్నిహితులు. ఎందుకంటే దేవుళ్లిద్దరూ మానవ కర్మలను బట్టి ఫలితాలను ఇస్తారు. శనీశ్వరుడిని శాంతింపజేయడానికి, శనిగ్రహ దోషాల నుండి బయటపడటానికి, ప్రతి శనివారం శనీశ్వరుడికి పూజ, ఉపవాసం చేస్తారు. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం అత్యంత పవిత్రమైన రోజు. శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం వలెనే ప్రతి శనివారం కూడా చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి పూజ చేస్తే శనీశ్వరుడితో పాటు మహాదేవుడు సంతృప్తి చెందుతాడు. శనీశ్వరుడి పూజ చాలా ముఖ్యమైనది. అందుకనే శనీశ్వరుడికి సంబంధించిన వివిధ సమస్యలు తగ్గుతాయి, అలాగే మహాదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత. సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పుడు శనీశ్వరుడిని పూజించకూడదు. దీనికి కారణం ఈ సమయంలో సూర్యుడు శని గ్రహం వెనుక ఉండటమే. అంతేకాదు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని కవచాన్ని పఠించాలి. అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి శనివారం మహాదేవుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. ఇది జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది. సమస్యల సుడిగుండాన్ని తగ్గించడం తద్వారా విజయం లభిస్తుంది. ఆర్ధిక కష్టాలు తీరి డబ్బు వస్తుంది.

శని కవచం

శిరః శనైశ్చరః పాతు ఫాలం మే సూర్యనందనః |
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః || ౧ ||

ఇవి కూడా చదవండి

నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా |
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః || ౨ ||

స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః |
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా || ౩ ||

నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా |
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా || ౪ ||

పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః |
అంగోపాంగాని సర్వాణి రక్షేన్మే సూర్యనందనః || ౫ ||

ఫలశ్రుతిః –
ఇత్యేతత్కవచం దివ్యం పఠేత్ సూర్యసుతస్య యః |
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః || ౬ ||

వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోఽపి వా |
కలత్రస్థో గతో వాఽపి సుప్రీతస్తు సదా శనిః || ౭ ||

అష్టమస్థే సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే |
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్ || ౮ ||

ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా |
ద్వాదశాష్టమ జన్మస్థ దోషాన్నాశయతే సదా || ౯ ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీ శని వజ్రపంజర కవచమ్ |

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు