హిందూ మతంలో స్వప్న శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. స్వప్న శాస్త్రంలో కొన్ని కలలు మనిషి జీవితానికి శుభమైనవిగా పరిగణించబడతాయి. మరి కొన్ని అశుభమైనవిగా పరిగణించబడతాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ నిద్రపోయేటప్పుడు ఎన్నో కలలు చూస్తారు. ఆ కలల్లో అనేక జీవులు, చాలా విషయాలు కనిపిస్తాయి. ప్రతి కలకు ఖచ్చితంగా కొంత అర్థం ఉంటుంది. కొన్ని రకాల కలలు భవిష్యత్ సంఘటనల గురించి సూచనలు ఇస్తాయని నమ్ముతారు. ఈ కలలలో ఒకటి కలలో గుర్రాన్ని చూడటం. మీరు ఎప్పుడైనా కలలో గుర్రాన్ని చూసినట్లయితే.. అది జీవితంలో ఎలాంటి సంకేతాలు ఇస్తుందో తెలుసా? ఈ రోజు కలలో గుర్రం ఏ విధంగా కనిపిస్తే ఏలాంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం..
కలలో గుర్రాన్ని చూడడానికి అర్థం
కలలో గుర్రాన్ని చూడటం: స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గుర్రం కనిపిస్తే చాలా మంచిదని భావిస్తారు. ఇది వ్యక్తి జీవితంలో సంపదను పొందుతారని సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తి గౌరవం, కీర్తిని పెంచుతుందని విశ్వాసం. మీ కలలో గుర్రం కనిపిస్తే సమాజంలో ఉన్నత స్థితిని పొందబోతున్నారని అర్థం.
కలలో గుర్రపు స్వారీ: కలలో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే.. లేదా స్వారీ చేస్తున్న గుర్రం కనిపిస్తే ఈ కలకు అర్ధం మీ పనిలో విజయం సాధించబోతున్నారని అర్థం. అలాగే మీ లక్ష్యాన్ని సాధించబోతున్నారని అర్ధం. ఇటువంటి కల వ్యక్తి పురోగతిని సూచిస్తుంది.
కలలో పరుగెత్తే గుర్రాన్ని చూడటం: కలలో పరుగెత్తుతున్న గుర్రం చూడటం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కలకు అర్ధం ఏమిటంటే త్వరలో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయబోతున్నారని, మీరు డబ్బు పొందబోతున్నారని అర్థం.
రెక్కలుగల గుర్రం కనిపిస్తే: మీ కలలో రెక్కలు గుర్రం కనిపించినా.. గుర్రం ఎగురుతున్నట్లు చూసినట్లయితే.. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని.. శుభకార్యాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని నమ్మకం.
కలలో అనారోగ్యంతో ఉన్న గుర్రాన్ని చూడటం: అనారోగ్యంతో లేదా గాయపడిన గుర్రాన్ని కలలో కనిపిస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఇటువంటి కలలను చూడటం వలన మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు