
Tirumala Srivani Darshanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసింది. శ్రీవాణి టికెట్ ఉన్న భక్తులకు ఒకే రోజు దర్శనం కల్పించే పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని నిర్ణయించింది. గతంలో అంటే జూలై 31 వరకూ శ్రీవాణి టికెట్‌పై దర్శనానికి మూడు రోజులు పట్టేది. కానీ, ఆగష్టు 1 నుంచి ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆరోజే దర్శనానికి వీలు కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రారంభంలో తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్‌లైన్ కోటా కింద టిక్కెట్లు కోరుకునే భక్తులకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుంది. తిరుమలలోని ప్రస్తుత బుకింగ్ కౌంటర్లలో టీటీడీ దాదాపు 800 టిక్కెట్లను, విమానాశ్రయంలో 200 టిక్కెట్లను అందిస్తుంది. ఆగస్టు 1 నుంచి ఆగష్టు 15వ తేదీ వరకు రెండు వారాల పాటూ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఇకపోతే, ఆగస్టు 2025 లో తిరుమలలో విశేష పర్వదినాలు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.
* ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి
* ఆగష్టు 4న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
* ఆగష్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమై ఆగష్టు 07న ముగుస్తాయి
* ఆగష్టు 8న తిరు నక్షత్రం
* ఆగష్టు 9న శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తారు
* ఆగష్టు 10న శ్రీ మలయప్ప స్వామి వారు విఖనసాచార్యుల సన్నిధికి వేస్తారు
* ఆగష్టు 16న గోకులాష్టమి ఆస్థానం జరుగుతుంది
* ఆగష్టు 17న తిరుమల శ్రీవారి సన్నిధి నశిక్యోత్సవం
* ఆగష్టు 25న బలరామ జయంతి, వరాహ జయంతితో పర్వదినాలు జరుగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..