Srisailam Temple: మల్లన్న భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాల నిలిపివేత.. ఎప్పటినుంచంటే?

2వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్తరద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Srisailam Temple: మల్లన్న భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాల నిలిపివేత.. ఎప్పటినుంచంటే?
Srisailam Temple

Updated on: Dec 29, 2022 | 5:50 AM

ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతారు. ఓ వైపు స్పర్శ దర్శనాలు, మరో వైపు భక్తుల దర్శనాలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో దేవస్థానం మల్లికార్జున స్వామి గర్భగుడిలో స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో ల‌వ‌న్న ప్రకటించారు. ఈమేరకు శ్రీశైలంలో ఈనెల 31 నుంచి జనవరి 2 వరకు శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలు నిలిపేసినట్లు తెలిపారు.

జనవరి 1 నూతన సంవత్సరం, జనవరి 2న ముక్కోటి ఏకాదశితో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రనికి వచ్చే అవకాశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

31 నుంచి మూడు రోజులపాటు శ్రీస్వామివారి గర్భాలయా అభిషేకాలు,వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

2వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్తరద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జనవరి 2 న ముక్కోటి ఏకాదశి రోజు శ్రీస్వామి అమ్మవారికి రావణవాహనసేవ, గ్రామోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు, అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..