Somvati Amavasya 2024: సోమవతి అమావాస్యన సూర్యగ్రహణం.. పూర్వీకుల ఆశీర్వాదం కోసం ఈ చర్యలు చేయండి

|

Apr 03, 2024 | 8:17 AM

శాస్త్రాల ప్రకారం ఎవరి జాతకంలో పితృ దోషం ఉంటే  దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సోమవతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ ఆశీస్సులను అందజేస్తారు. సోమవతి అమావాస్య నాడు సాయంత్రం ఈశాన్య మూలలో ఆవు నెయ్యి దీపం వెలిగించి..  ఆ దీపంలో నెయ్యి పోస్తూ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి

Somvati Amavasya 2024: సోమవతి అమావాస్యన సూర్యగ్రహణం.. పూర్వీకుల ఆశీర్వాదం కోసం ఈ చర్యలు చేయండి
Somvati Amavasya 2024
Follow us on

హిందూ మతంలో అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పంచాంగం ప్రకారం ప్రతి హిందూ నెలలో చివరి రోజును అమావాస్య అంటారు. ఈ రోజున ఉపవాసం, పూజలు, స్నానం, దానధర్మాలు మొదలైన వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా సోమవతి అమావాస్య రోజున ఏర్పడబోతోంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కనుక గ్రహణ ప్రభావం మన దేశంపై ఉండదు.

పంచాంగం ప్రకారం ఈసారి అమావాస్య 8 ఏప్రిల్ 2024 సోమవారం వస్తుంది. సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. అన్ని అమావాస్యలలో సోమవతి అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకుల అనుగ్రహం పొందడానికి, స్నానం, దానంతో పాటు, పితృ పూజ కూడా చేస్తారు.

మత విశ్వాసాల ప్రకారం సోమవతి అమావాస్య రోజున ఆరాధనతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. దీనితో పాటు గ్రహ దోషాలు , పితృ దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు సోమవతి అమావాస్య నాడు తీసుకోవాల్సిన కొన్ని ప్రభావవంతమైన చర్యలను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

శాస్త్రాల ప్రకారం ఎవరి జాతకంలో పితృ దోషం ఉంటే  దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సోమవతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ ఆశీస్సులను అందజేస్తారు.

సోమవతి అమావాస్య నాడు సాయంత్రం ఈశాన్య మూలలో ఆవు నెయ్యి దీపం వెలిగించి..  ఆ దీపంలో నెయ్యి పోస్తూ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది.  లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుందని నమ్మకం. ఈ పరిహారం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది.

విశ్వాసాల ప్రకారం సోమవతి అమావాస్య ప్రత్యేక రోజున శివ పార్వతులకు, లక్ష్మీదేవికి బియ్యం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సుతోపాటు దేవతామూర్తుల అనుగ్రహం లభిస్తుంది.

అమావాస్య రోజున స్నానం చేసి దానం చేయాలి. అనంతరం పూజ చేసిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంటి సమీపంలోని చెరువు లేదా నదికి వెళ్లి చేపలకు ఈ పిండిని ఆహారంగా అందించండి. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. కుటుంబంలో సానుకూల శక్తి  పెరుగుతుంది.

సోమవతి అమావాస్య 2024 శుభ సమయం

వేదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష అమావాస్య తిథి ఏప్రిల్ 8 న తెల్లవారుజామున 3:31 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఏప్రిల్ 8 రాత్రి 11:50 గంటలకు ముగుస్తుంది. అమావాస్య ఉపవాసం 8 ఏప్రిల్ 2024, సోమవారం నాడు చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6.14 గంటల వరకు సాగే ఈ విశేషమైన రోజున ఇంద్రయోగం ఏర్పడుతోంది. ఉదయం 4.55 నుండి 6.30 గంటల మధ్య స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు