Solar Eclipse: నేడు తులారాశిలో ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ నక్షత్రాలవారితో పాటు గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు

|

Oct 25, 2022 | 7:55 AM

సూర్యుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఉన్న సమయంలో గ్రహణం  ఏర్పడనుంది. కనుక తులారాశివారు సూర్యగ్రహణాన్ని చూడరాదు. స్వాతి నక్షత్రంలో జన్మించినవారిపై సూర్యగ్రహణ ప్రభావం ఉండనుందని పంచాంగకర్తలు చెబుతున్నారు

Solar Eclipse: నేడు తులారాశిలో ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ నక్షత్రాలవారితో పాటు గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు
Surya Grahan 2022
Follow us on

నేడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీపావళి అమావాస్య రోజున దాదాపు 27 ఏళ్ల తర్వాత సూర్యగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ గ్రహణం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం.. సూర్యుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఉన్న సమయంలో గ్రహణం  ఏర్పడనుంది. కనుక తులారాశివారు సూర్యగ్రహణాన్ని చూడరాదు. స్వాతి నక్షత్రంలో జన్మించినవారిపై సూర్యగ్రహణ ప్రభావం ఉండనుందని పంచాంగకర్తలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రహణ కాలం దాదాపు 1.15 నిముషాల పాటు పాక్షికంగా ఉండనుంది.  తెలంగాణాలో ప్రధాన నగరమైన హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుంచి 5. 49 నిముషాలు కొనసాగుతుంది. ఆంధ్రపదేశ్ లో విశాఖలో 5 గంటల 1 నిమిషం సయయంలో ఏర్పడనున్నదని.. దీని ప్రభావం 49 నిమిషాల పాటు ఉండనుంది.

చంద్రుడు సూర్యునికి భూమికి మధ్యకు వచ్చి.. ఆ సమయంలో సూర్యుని కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకుంటుంది. అప్పుడు భూమి మీద కొంత కొన్ని భాగాల్లో సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడడు. సూర్యగ్రహణం ఖగోళ సంబంధమైన సంఘటన. సైన్స్ పరంగా గ్రహణం కాలం గురించి అనేక విషయాలను వెల్లడించిన.. భారతీయ సంస్కృతిలో గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణ సమయంలో సాధారణ పౌరులే కాదు.. గర్భణీలు కూడా సైన్స్ కంటే.. పండితులు చెప్పిన వాటినే ఎక్కువగా విశ్వసిస్తారు.

గ్రహణం ఏర్పడే సమయానికి ఒక గంట ముందు నుంచే ఆహారపానీయాలను తీసుకోరు. కొంతమంది గ్రహణం ఏర్పడే ముందు శుచిగా స్నానం చేస్తారు. పల్లెల్లో అయితే నదులు, కాల్వలు, సముద్రం, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అనంతరం గ్రహణం విడిచి పెట్టిన అనంతరం విడుపు స్నానం చేస్తారు. దీనిని గ్రహణ ఆచారాల్లో ఓన భాగంగా పాటిస్తారు.

ఇవి కూడా చదవండి

గర్భణీలు గ్రహణ సమయంలోకి ఇంట్లోనే ఉండాలి. ఎటువంటి పనులు చేయకుండా రెస్ట్ తీసుకుంటారు. గ్రహణం చూస్తే.. అప్పుడు కిరణాల ప్రభావం వారి గర్భస్థ శిశువుపై పడుతుందని నమ్మకం.. అంతేకాదు కొన్ని సార్లు అంగవైకల్యంగా పుడతారని కూడా పెద్దలు చెబుతుంటారు. అందుకనే గర్భణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని సూచిస్తారు.

మధ్యాహ్నం 3 లోపు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. తరువాత అవసరమైతే ద్రవ పదార్థాలు తీసుకోవచ్చును. కాని ఘన పదార్థాలు తీసుకోరాదు.

గ్రహణ సమయంలో జంతువులు కూడా ఏవీ బయటకి రావు. గ్రహణం పూర్తయ్యే వరకూ పశుపక్షాదులు కూడా బయటకు రావు.

గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలతో సహా అన్ని  ఆలయాలు మూసివేయనున్నారు. గ్రహణకాలం ముగిసిన అనంతరం ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించి.. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

మరొకొందరు తమ పితృదేవల పేరు మీద దాన ధర్మాలను చేస్తారు. ముఖ్యంగా సూర్యగ్రహణం ఏర్పడుతున్న తులారాశి వారు, నక్షత్రాల వారు ఆయా గ్రహాల అనుగ్రహం కోసం ఆలయానికి వెళ్లి శాంతి పూజలు చేస్తారు. దాన, ధర్మాలు చేస్తారు.

ఈ గ్రహణం విషయంలో హేతు వాదులు చెప్పే విషయాన్నీ కూడా లెక్కచేయకుండా పురాణాలు, పురోహితులు చెప్పే విషయాలకే ప్రాముఖ్యత నిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)