Shri Ramayana Yatra: రామ భక్తులకు బిగ్‌ న్యూస్‌.. 7న ప్రారంభం కానున్న శ్రీ రామాయణ రైలు యాత్ర..

|

Oct 05, 2021 | 8:59 AM

Shri Ramayana Yatra Train Tours: శ్రీ రాముడి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హిందూ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్

Shri Ramayana Yatra: రామ భక్తులకు బిగ్‌ న్యూస్‌.. 7న ప్రారంభం కానున్న శ్రీ రామాయణ రైలు యాత్ర..
Shri Ramayana Yatra
Follow us on

Shri Ramayana Yatra Train Tours: శ్రీ రాముడి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హిందూ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పండగ సీజన్‌లో శ్రీ రామాయణ రైలు యాత్రను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. భారత రైల్వే ఐఆర్‌సీటీసీ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా శ్రీ రామాయణ యాత్రను నవంబరు 7వ తేదీన ప్రారంభించనుంది. మొదటగా ఈ ట్రైన్‌ ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా యాత్రికులు శ్రీరాముని జీవితానికి సంబంధించిన అన్ని ప్రదేశాలను సందర్శించి తరించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పర్యాటక రైళ్లు, డీలక్స్ టూరిస్ట్ రైళ్లను ఉపయోగించుకుని రైలు టూర్ ప్యాకేజీలను ప్లాన్ చేసినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఈ యాత్రలో భాగంగా భక్తులకు అల్పాహారం, భోజనం తదితర సదుపాయాలను ప్యాకేజీలో కోరుకున్న విధంగా కల్పించనున్నారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం.. ఈ యాత్రను నిర్వహించనున్నారు. అందుకోసం ముందస్తుగా భారతీయ రైల్వే ప్రణాళికలు చేసింది.

దక్షిణ భారతదేశంలో..
అయితే.. దక్షిణ భారతదేశంలోని యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ స్లీపర్ క్లాస్ కోచ్‌లతో బడ్జెట్-సెగ్మెంట్ రైలులో శ్రీ రామాయణ యాత్ర మధురై నగరం నుంచి మొదటగా ప్రారంభం కానుంది. ఈ రైలు మధురై నుంచి దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట్టై, కాట్‌పాడి, చెన్నై సెంట్రల్, రేణిగుంట, కడప, హంపి, నాసిక్, చిత్రకూట్, ప్రయాగరాజ్, వారణాసి చేరుకొని.. తిరిగి మరలా మధురైకి చేరుకుంటుంది.12 రాత్రులు, 13 రోజులు సాగనున్న శ్రీ రామాయణ యాత్ర మధురై నుంచి నవంబర్ 16వ తేదీన ప్రారంభం కానున్నట్లు దక్షిణ మద్య రైల్వే వెల్లడించింది.

ఉత్తర భారతదేశంలో

ఉత్తర భారతదేశంలో బడ్జెట్ సెగ్మెంట్ పర్యాటకుల కోసం శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక పర్యాటక రైళ్లతో ప్రారంభం కానుంది. 17 రోజులు శ్రీ రామాయణ యాత్ర నవంబర్ 25వతేదీన శ్రీ గంగానగర్ నుంచి మొదట ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. గంగానగర్ నుంచి అబోహర్-మాలౌట్, భటిండా, బర్నాలా, పాటియాలా, రాజ్‌పురా, అంబాలా క్యాంట్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, ఢిల్లీ క్యాంట్, గుర్గావ్, రేవారీ, అల్వార్, జైపూర్, ఆగ్రాల వద్ద బోర్డింగ్, డి-బోర్డింగ్ పాయింట్‌లతో ప్రారంభం కానుంది. కోట, ఇటావా, కాన్పూర్ అయోధ్య, సీతామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగరాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, కాంచీపురం మీదుగా ఈ రైలు శ్రీ గంగానగర్‌కు తిరిగి చేరుకుంటుంది. నవంబర్ 27నుంచి మహారాష్ట్ర పూణే నుంచి శ్రీ రామ్ పథ యాత్ర 8 రోజులపాటు సాగనుంది. డిసెంబర్ 25న సబర్మతి నుంచి శ్రీ రామ యాత్ర ప్రారంభమవనుంది.

Also Read:

Cyber Crime: మళ్లీ రెచ్చిపోయిన మాయగాళ్లు.. సోషల్ మీడియా వేదికగా వృద్ధురాలిని నిలువు దోపిడీ చేశారు..!

Petrol Diesel Price: రోజు రోజుకు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉందంటే..