Krishna Janmashtami: కన్నయ్య అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. కృష్ణాష్టమి రోజున వీటిని సమర్పించండి..

| Edited By: Anil kumar poka

Aug 20, 2022 | 1:50 PM

కృష్ణాష్టమిరోజున పూజించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పూజావిధానం, అలంకరణకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.. 

Krishna Janmashtami: కన్నయ్య అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. కృష్ణాష్టమి రోజున వీటిని సమర్పించండి..
Sri Krishnastami Puja
Follow us on

Krishna Janmashtami 2022: తమ పిల్లల పుట్టిన రోజు అంటే ఏ తల్లిదండ్రులకైనా అపురూపమే.. మరి లాంటిది అందరివాడైన కన్నయ్య పుట్టిన రోజు వేడుకలంటే.. మరి ప్రతి ఒక్క భక్తుడు హర్షం వ్యక్తం చేస్తారు. శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమిరోజున శ్రీ కృష్ణ భగవానుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది  కృష్ణాష్టమి 18 ఆగస్టు 2022 న వచ్చింది. ఈరోజు శ్రీకృష్ణ భక్తులు అత్యంత విశ్వాసంతో శ్రీకృష్ణుడికి పూజలు, ఉపవాసం, కీర్తనలు మొదలైనవి చేస్తారు. శ్రీ కృష్ణుడు 64 కళలు కలవాడని నమ్మకం. శ్రీకృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే.. అయన ప్రసన్నుడై, రెప్పపాటులో జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలను తొలగించి.. సుఖ సంతోషాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో కృష్ణాష్టమిరోజున పూజించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పూజావిధానం, అలంకరణకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

వేణువు: 
శ్రీ కృష్ణ భగవానుడి పుట్టిన రోజున వేణువు లేకుండా పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. శ్రీ కృష్ణుడికి మురళి ఎంతో  ప్రీతిపాత్రమైనదని అందుకే ఆయనను మురళీధరుడని అంటారు. అటువంటి పరిస్థితిలో, శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు లభించాలంటే.. కన్నయ్య జన్మదినం రోజున మురళిని స్వామివారికి సమర్పించాలి.

నెమలి ఈక
మురళితో పాటు నెమలి ఈకలను సమర్పించడం కూడా శ్రీకృష్ణుని పూజలో చాలా ముఖ్యమైనది. కృష్ణ భగవానుడు నెమలి పింఛానికి బహుమతిగా అందుకున్నాడు. అప్పుడు ఆ నెమలి ఈకను కిరీటంగా ఉపయోగించాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, జన్మాష్టమి పూజ ఫలితం దక్కాలంటే.. నెమలి ఈకలను, దానితో చేసిన కిరీటాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించండి.

ఇవి కూడా చదవండి

శంఖం:
కన్నయ్య జన్మదినోత్సవం రోజున శంఖం లేని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. సనాతన సంప్రదాయంలో శంఖం శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. జన్మాష్టమి పర్వదినం రోజున కన్నయ్యకు స్నానము చేయించిన అనంతరం.. పూజ సమయంలో శంఖాన్ని పురిస్తారు. కనుక జన్మాష్టమి పూజ సమయంలో శంఖం ఉండాలి.

తులసి
పవిత్రమైన జన్మాష్టమి పండుగ రోజున..  నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణం. కన్నయ్య పుట్టిన రోజున మీరు ఏ ప్రసాదం చేసినా, అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. జన్మాష్టమి పూజలో తులసి దళాన్ని సమర్పించడం ద్వారా అనుగ్రహం సులభంగా దొరుకుంది. కోరుకున్న వరం లభిస్తుందని నమ్మకం.

దోసకాయ
పవిత్రమైన జన్మాష్టమి నాడు.. కన్నయ్య పూజలో ఒక కొమ్మతో కూడిన దోసకాయకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ దోసకాయను  సమర్పించడానికి.. బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు తాడును తన తల్లి నుండి వేరు చేయడానికి సంబంధం ఉందని నమ్మకం. జన్మాష్టమి రోజున దోసకాయను .. కాడను నుంచి కత్తిరిస్తారు. అదే విధంగా శ్రీకృష్ణుడు తన తల్లి దేవకి నుండి వేరు చేయబడ్డాడని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)