
mahashivaratri 2021 : లింగోద్భవ సమయాన్ని మహాశివరాత్రిగా హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు.. ఇక శివాగ్రహం కోసం శివాలయ సందర్శనం, అభిషేకం, జాగరణ, ఉపవాసం పూజాదికార్యక్రాలను విధిగా ఆచరిస్తారు. అయితే ఈరోజు ఎక్కువుగా ఉపవాసం ఉంటారు. ఇలా ఎందుకు చేయాలని ఉపవాస నియామాలు ఉపవాసం చేయడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం..!
మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శంకరుడిని భక్తు శ్రద్దలతో ఆరాధిస్తే శుభం జరుగుతుందని హిందువుల నమ్మకం.. ఇక మహిళలు అయితే మంచి భర్త వస్తాడని నమ్ముతారు. పెళ్లి కాని యువతులు ఈరోజు ఉపవాసం చేస్తే. వివాహంజరగడానికి ఏర్పడిన అడ్డంకులు ఏమైనా ఉంటె తొలగిపోతాయని.. మంచి భర్త లభిస్తాడని వేద పండితులు చెబుతారు.
ముఖ్యంగా శివరాత్రి రోజున జాగారం చేస్తారు.. మరి అలా చేయాలంటే పొట్ట ఖాళీగా ఉండాలి.. లేదంటే నిద్ర వస్తుంది.. కనుక ఆరోజంతా ఉపవాసం ఉండి..జంగమయ్యను ఆరాధిస్తూ.. అర్చన చేస్తే.. దారిద్య్రం తొలగిపోతుందని కొంతమంది విశ్వాసం..
శివరాత్రి రోజున ఉపవాసం చేస్తే దేవుడి ఆశీర్వాదం లభించి అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక శివునికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజ చేసి ఉపవాసం చేయడం వల్ల జీవితం లో ఆనందం, శాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
అందుకనే శివరాత్రి రోజున ఆచరించే పూజా విధానంలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఉపవాసం చేసిన వారు శివనామ స్మరణ చేయడం అత్యంత శుభప్రదం. ఇక ఉపవాసం చేయడంతో శారీరక శుద్ధి కలుగుతుంది.. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు చెబుతున్నారు. ఇక శివరాత్రి రోజున ఉపవాసం చేసిన వారు.. మర్నాడు కనీసం ఒక పేదవారికి అయినా అన్నం పెడితే మంచి జరుగుతుందని విశ్వాసం
Also Read: